● నందవరంలో 68 మి.మీ వర్షపాతం
కర్నూలు(అగ్రికల్చర్): పెనుగాలులు ఉమ్మడి కర్నూలు జిల్లాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో మొదలైన గాలుల తీవ్రత శుక్రవారం ఉదయం వరకు కొనసాగింది. పలు మండలాల్లో వర్షాలు కూడా కురిశాయి. ఒకవైపు ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుండగా.. మరోవైపు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతుండటం గమనార్హం. నందవరంలో 68 మి.మీ వర్షపాతం నమోదు కావడం విశేషం. కర్నూలు జిల్లాలో సగటున 11.8 మి.మీ, నంద్యాల రూరల్‌లో 10.4 మి.మీ ప్రకారం వర్షపాతం నమోదైంది. పలు మండలాల్లో చెట్లు విరిగిపడగా, మామిడి పంట భారీగా నేల రాలింది.
విద్యుత్ శాఖకు రూ.90 లక్షల నష్టం
గాలుల తీవ్రత విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు విరిగి పడ్డాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖకు మొత్తం రూ.90 లక్షల నష్టం వాటిళ్లినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు.
మండలం వర్షపాతం(మి.మీ)
హొళగుంద 40.2
పెద్దకడుబూరు 26.4
హాలహర్వి 26.2
కొలిమిగుండ్ల 24.8
ఎమ్మిగనూరు 23.2
కోడుమూరు 22.6
దేవనకొండ 22.4
నందికొట్కూరు 20.2
కౌతాళం 18
ఆదోని 16.8
అవుకు 15.4
బనగానపల్లి 12.6


