ఓట్ల తొలగింపునకు కుట్ర | - | Sakshi
Sakshi News home page

ఓట్ల తొలగింపునకు కుట్ర

May 22 2026 4:40 AM | Updated on May 22 2026 4:40 AM

బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి సమావేశంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

డోన్‌: వచ్చే స్థానిక ఎన్నికలలోపు తమకు వ్యతిరేకమైన వారి ఓట్లు తొలగించేందుకు అధికారపార్టీలు కుట్ర పన్నుతున్నాయని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. గురువారం రాత్రి తన స్వగృహంలో పట్టణ బూత్‌ లెవల్‌ ఏజెంట్ల (బీఎల్‌ఎ) సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇటీవల జరిగిన 10 రాష్ట్రల సాధారణ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌ను అడ్డు పెట్టుకొని సర్‌ పేరుతో ముస్లిం, క్రిస్టియన్‌, ఎస్సీ, ఎస్టీ ఓట్లను జాబితా నుండి తొలగించినట్లు అరోపణలు వచ్చాయాన్నారు. మన రాష్ట్రంలో కూడా బోగస్‌ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతుందని ప్రతి బీఎల్‌ఎ తన బూత్‌ పరిధిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకు బూత్‌ పరిధిలో ఓటరుజాబితాపై సంపూర్ణ అవగాహన కల్గి ఉండాలని సూచించారు. ప్రస్తుత తరుణంలో అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు కొన్ని పార్టీలు అడ్డదారులు తొక్కుతున్నాయన్నారు. వాటి కుట్రలను భగ్నం చేసేందుకు ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్త బీఎల్‌ఎలతో కలిసి సైనికుల వలే పని చేయాలన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తిరిగి వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తెచ్చుకోవాలన్నారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల్లో కొందరు బదిలీలకు బయపడి, ప్రలొభాలకు లొంగి అధికారపార్టీ నాయకులు చెప్పినట్లు చేస్తున్నారన్నారు. రాత్రికి రాత్రే నిజమైన ఓటర్ల పేర్లను మాయం చేస్తున్నారన్నారు. దీనిని అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో మీట్‌ మాజీ చైర్మెన్‌ శ్రీరాములు, మాజీ మున్సిపల్‌ చైర్మెన్‌ సప్తశైల రాజేష్‌, మాజీ వైస్‌ చైర్మెన్‌ జాకీర్‌ హుసేన్‌, ముస్లిం మైనారిటీ నాయుకులు అక్బర్‌ బాషా,షేట్‌లతో పాటు పట్టణ బీఎల్‌ఎలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement