కంపమల్ల కుంట పనుల్లో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

కంపమల్ల కుంట పనుల్లో ఉద్రిక్తత

May 21 2026 4:57 AM | Updated on May 21 2026 4:57 AM

కోవెలకుంట్ల: కంపమల్ల కుంట పనుల్లో రెండు రోజుల నుంచి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కుంటలో మట్టి తవ్వక పనులు చేపట్టగా ప్రజలు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో హైటెన్షన్‌ నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలు.. గ్రామంలోని బీసీ కాలనీ సమీపంలో కుంటలో నీరు పుష్కలంగా ఉంది. గ్రామ టీడీపీ నాయకులు కుంటలో మట్టి తవ్వకాలు జరిపేందుకు ప్రొక్లెయిన్‌, ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. కుంటలో గుంతలు తవ్వడంతో అనేక సమస్యలు తలెత్తే అస్కారం ఉందని టీడీపీ నాయకులను కాలనీ వాసులు ప్రశ్నించారు. కట్ట తెగిపోయి నీరు బీసీ కాలనీని ముంచెత్తే ప్రమాదం ఉందని నిలదీశారు. బీసీ కాలనీలో ఎక్కువశాతం కుటుంబాలు వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులు ఉండటంతో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మట్టి తవ్వక పనులు చేపట్టేందుకు టీడీపీ నాయకులు సిద్ధమయ్యారు. ఎటువంటి పరిస్థితుల్లో మట్టి తవ్వక పనులు జరగనీవ్వబోమని కాలనీ వాసులు హెచ్చరించారు. దీంతో బుధవారం తహసీల్దార్‌ పవన్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ ప్రకాష్‌నాయుడు, ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, మండల సర్వేయర్‌ వీరన్న, మైనర్‌ ఇరిగేషన్‌ శాఖ అధికారులు గ్రామాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాలనీ వాసులతో చర్చించి పనులను తాత్కాలికంగా నిలిపి వేయడంతో సమస్య సద్దుమణిగింది.

Advertisement
 
Advertisement
Advertisement