టీజీ, వైఎస్సార్‌సీపీ మధ్య వివాదం మరింత ముదురుతోంది. టీజీ ఆల్కలీస్ ఫ్యాక్టరీ విస్తరణలో భాగంగా వారు చేపట్టే నిషేధిత రసాయనాల వాడకంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. అలాగే దీనిపై ఉద్యమం చేపట్టాలని భావిస్తోంది. అలాగే మంత్రి అవకతవక నిర్ణయాలపై కూడా పోరు తీవ్రతరం చేసేందుకు ఉపక్రమిస్తోంది. ఏ, బీ, సీ క్యాంపు క్వార్టర్ల విషయంలో స్టేడియం నిర్మిస్తున్నాం ఖాళీ చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులు నోటీసులు ఇవ్వడం, అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పడం చూస్తే రెండింటిలో వాస్తవం ఏంటని? క్వార్టర్లు కూల్చేయాలనేది ప్రభుత్వ నిర్ణయా? భరత్ వ్యక్తిగత నిర్ణయమా? ప్రభుత్వ నిర్ణయమైతే జీవో ఏది? భరత్ వ్యక్తిగతమైతే కూల్చేసే హక్కు ఎక్కడుందని ఆ ఆస్తులు కబ్జా చేయకుండా ఉద్యమించేందుకు వైఎస్సార్‌సీపీ నేతలే ఏకమై ప్రణాళిక రచిస్తున్నారు.


