బనగానపల్లె రూరల్: మండలంలోని నందివర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని జిల్లెల్ల గ్రామంలో ఎం.పుష్పాంజలి (19) అనే యువతి తనకు ఇప్పుడే వివాహం వద్దంటూ పేడరంగు ద్రావ కం సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై ఎస్‌ఐ భూపాలుడు తెలి పిన వివరాల మేరకు.. జిల్లెల్ల గ్రామానికి చెందిన మేకల వీరాంజనేయులు, సరోజమ్మ దంపతుల కూ తురు పుష్పాంజలి ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది. తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయాలనే ఉద్దేశంతో సంబంధాలు చూస్తున్నారు. తన కు ఇంకా చదువుకోవాలని ఉందని, ఇప్పుడే పెళ్లి వద్దని పుష్పాంజలి తల్లిదండ్రులకు చెప్పింది. అయినా వారు వినలేదు.ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పే డరంగు నీటిలో కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


