సుగంధ పాలవేర్లతో చేసే నన్నారి (షర్బత్) అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా శరీరానికి చలువ చేసే గుణాన్ని కలిగిన షర్బత్ ను వేసవి కాలంలో ఎక్కువగా తాగుతుంటా రు. అడవుల్లో లభించే సుగంధి పాల వేర్ల గురి ంచి ఆయుర్వేదంలో మంచి ఔషధంగా పేర్కొన్నారు. దీన్ని తాగడం ద్వారా వేడిని తగ్గించి చలువ చేయడంతో పాటు జీర్ణక్రియలకు సంబంధించి వ్యాధులు తగ్గుతాయి. మహానంది మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురంలో నన్నారి షర్బత్ తయారు చేస్తున్న దృశ్యమిది.
– మహానంది


