మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని వగరూ రు గ్రామంలో కురువ బజారి (50) అనే ఉపాధి కూ లీ వడదెబ్బకు గురై మృతి చెందాడు. సోమవారం ఉపాధి పనులకు వెళ్లి ఇంటికి రాగానే బజారి తీవ్ర అస్వస్తతకు గురయ్యా డు. కుటుంబ సభ్యులు స్థానిక వైద్యశాలకు తీసుకెళ్లి వైద్య సేవలు అందించినా కోలుకోలేక మంగళవారం మృతిచెందాడు. ఎండ తీవ్రత తట్టుకోలేక వడదెబ్బకు గురై మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యనిర్వహక కమిటీ సభ్యుడు వై.సీతారామిరెడ్డి, ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. వారి ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ మండల జిల్లా కార్యదర్శి విశ్వనాథ్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించి ఎమ్మెల్యే తరఫున రూ.10 వేలు సాయం అందించారు. ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలని కోరారు.


