మహిళల జీవనోపాధులకు కృషి | - | Sakshi
Sakshi News home page

మహిళల జీవనోపాధులకు కృషి

May 19 2026 1:28 AM | Updated on May 19 2026 1:28 AM

మహిళల జీవనోపాధులకు కృషి

శిరివెళ్ల: పొదుపు సంఘాల మహిళల జీవనోపాధులకు కృషి చేస్తున్నామని వెలుగు సీ్త్ర నిధి ఏజీఎం నాగభూషణం అన్నారు. సోమవారం స్థానిక వెలుగు కార్యాలయంలో సీ్త్ర నిఽధి రుణాల పంపిణీ, వసూళ్లపై ఏపీఏం రాజశేఖరరెడ్డితో చర్చించారు. ఆయన మాట్లాడుతూ మహిళల జీవనోపాధులకు ఎంత నిధులు అవసరం, ఏ నిధులను ఏఏ విభాగాల నుంచి మంజూరు చేయాలనే అంశంపై మహిళలతో యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేస్తున్నామన్నారు. బ్యాంక్‌ లింకేజీ, ఉన్నతి, సీ్త్ర నిధి రుణాల మంజూరుకు యాక్షన్‌ ప్లాన్‌ ఉందన్నారు. 2026–26 ఆర్థిక సంఘానికి జిల్లాలో 40 వేల మంది మహిళలకు రూ. 377 కోట్ల సీ్త్ర నిధి రుణాల పంపిణీ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో సీసీలు పాల్గొన్నారు.

మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

శ్రీశైలంటెంపుల్‌: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు సోమవారం శ్రీగిరికి తరలివచ్చారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగాణం మారుమోగింది. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా క్యూకంపార్ట్‌మెంట్లలో వేడిపాలు, తాగునీరు, అల్పాహారం, ప్రసాదం పంపిణి చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్షేత్ర పరిధిలో పలుచోట్ల దేవస్థానం ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాలలో మంచినీటితో పాటు మజ్జిగను కూడా భక్తులకు ఉచితంగా అందిస్తున్నారు.

ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

డోన్‌ టౌన్‌: 2026–27 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ జిల్లా కన్వీనర్‌, డోన్‌ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్స్‌పాల్‌ ప్రసాద్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి పాస్‌, ఫెయిల్‌ ఆసక్తి కల్గిన అభ్యర్థులు ఈ నెల 19 నుంచి జూన్‌ 30వ తేదీ వరకు itiadmissions. ap.gov.in/iti వెబ్‌ సైటులో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసిన కాపీలను జూలై 2వ తేదీ లోపల సమీప ప్రభుత్వ ఐటీఐలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో వెళ్లి పరిశీలించుకోవాలన్నారు. వారికి మెరిట్‌ లిస్ట్‌ జాబితాలో పేర్లు పొందుపరుస్తామన్నారు. మరిన్ని వివరాలకు సమీప ఐటీఐ కళాశాలలను సంప్రదించాలన్నారు.

21 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 21 నుంచి వచ్చే నెల 4వ తేదీ నిర్వహించనున్నట్లు ఆర్‌ఐఓ జి.లాలెప్ప తెలిపారు. కర్నూలు ప్రభుత్వ టౌన్‌ మోడల్‌ కాలేజీలో సోమవారం ముఖ్య పర్యవేక్షకులు, శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్‌, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్‌ పరీక్షలు జరుగనున్నాయన్నారు. ఈ పరీక్షలకు 25,819 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, 57 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

బంగారంపై

రుణాల కోసం...

పత్తికొండ: పాసు పుస్తకంపై తక్కువ వడ్డీతో బంగారంపై రుణాలు ఇచ్చే సౌలభ్యం ఉండటంతో రైతులు భారీగా బ్యాంకులకు వెళ్తున్నారు. సోమవారం ఉదయమే పత్తికొండ పట్టణంలోని స్టేట్‌బ్యాంక్‌కు పెద్ద ఎత్తున వచ్చారు. బ్యాంక్‌ సిబ్బంది వారిని క్యూ పద్ధతిలో లోపలకి పంపారు. పట్టాదారు పాసుబుక్‌లను తీసుకుని టోకెన్‌ విధానం ద్వారా లోపలకి పిలిచి రుణం మంజూరు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement