ఎండలు భగ భగ మండుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే ప్రజలు బయటకు అడుగు పెట్టేందుకు భయపడుతున్నారు. పశుపక్ష్యాదులకు మండుటెండలోనూ ఆహారాన్వేషణ తప్పదు. తమిళనాడు నుంచి కొందరు బాతుల పెంపకందారులు రుద్రవరానికి చేరుకున్నారు. చుట్టు పక్కల గ్రామాల్లో ప్రస్తుతం రబీలో సాగు చేసి వరి కోతలు పూర్తయ్యాయి. ఆ పొలాల్లో బాతులను వదలుతున్నారు. అయితే నీటి వసతి అంతంత మాత్రంగా ఉండటంతో ఎండలకు బాతులు అలమటిస్తున్నాయి. ఆర్.కొత్తూరు సమీపంలోని వంకలో అరకొరగా ఉన్న నీటిలో దిగి సేద దీరుతూ ఉపశమనం పొందాయి. – రుద్రవరం


