ఇండక్షన్‌ స్టౌలను ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

ఇండక్షన్‌ స్టౌలను ప్రోత్సహించాలి

Mar 24 2026 7:09 AM | Updated on Mar 24 2026 7:09 AM

నంద్యాల: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో ఇండక్షన్‌ స్టౌల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి సూచించారు. ఇందుకు ఇండక్షన్‌ స్టౌల లభ్యత, ధరలు తదితర వివరాలను సేకరించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సాధారణంగా రోజుకు 5,500 ఎల్‌పీజీ గ్యాస్‌ బుకింగ్స్‌ నమోదవుతుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 10,000 వరకు పెరిగిందన్నారు. జేసీ కొల్లాబత్తుల కార్తీక్‌, డీఆర్‌ఓ రాము నాయక్‌, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ ప్రియాంక పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement