● శ్రీశైలం నుంచి కన్నడిగులు
తిరుగు ప్రయాణం
● 25 అడుగుల నందికోళ్లతో
స్వగ్రామానికి పాదయాత్ర
నందికోళ్లతో
కాలినడకన
స్వగ్రామాలకు వెళ్తున్న కన్నడ భక్తులు
జూపాడుబంగ్లా: ఉగాది ఉత్సవాలకు వందల కిలోమీటర్లు పాదయాత్రగా శ్రీశైలం వెళ్లిన కన్నడిగుల భక్తి అంచంచలమైనది. మండుటెండలకు వెనుకడగు వేయకుండా.. కొండ కోనలకు భయపడకుండా.. నల్లమల మీదుగా శ్రీశైలం చేరుకుని భ్రమరాంబ, మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కొందరు తిరుగు ప్రయాణంలో కూడా పాదయాత్రగా వెళ్తూ కనిపించారు. కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట్ జిల్లా జమ్‌ఖండి తాలూకా కొన్నూర్ గ్రామానికి చెందిన భక్తులు 25 అడుగుల నందికోలను ఎత్తుకొని, నూతన నందికోళ్ల తయారీకి నూతన వెదురు బొంగులను భుజాన ఉంచుకొని 600 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి తిరిగి వెళ్తుండటాన్ని చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు. వీరితో పాటు మహారాష్ట్రకు చెందిన మరికొంత మంది భక్తులు కాడెద్దులతో పాటు కావడిని భుజాన ఉంచుకొని కాలినడకన స్వగ్రామాలకు తిరిగి వెళ్తుండటం వారి భక్తిని ప్రశంసిస్తున్నారు.


