శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానంలో గర్భగుడిలో మల్లికార్జున స్వామి వారి మూలవిరాట్ ను సెల్ ఫోన్‌లో వీడియో చిత్రీకరణపై కేసు నమోదు చేశారు. శనివారం దేవస్థాన అధికారుల ఫిర్యాదు మేరకు శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి విధులపై అలసత్వం ప్రదర్శించిన ఆలయ పర్యవేక్షకులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్, ముగ్గురు సెక్యూరిటీ గార్డుల విధులను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు సమాచారం.
పది గడ్డివాములు దగ్ధం
హాలహర్వి: మండల పరిధిలోరి కొక్కరచేడు గ్రామంలో శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తూ చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో 10 గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన బోయ గోవిందుకు చెందిన మూడు, మాదిగ హనుమంతుకు చెందిన మూడు గడ్డివాములతో పాటు దేవరాజు, పింజరి అప్పయ్య, చండ్రప్ప, మస్తాన్‌లకు చెందిన గడ్డివాములతో కలిపి మొత్తం పది గడ్డివాములు ఈ ప్రమాదంలో కాలి బూడదయ్యాయి. సాయంత్రం 4.30 గంటల సమయంలో గడ్డివాములకు ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో స్థానికులు ఆలూ రు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. గాలి తీవ్రతతో మంటలు అదుపుకాక పోవడంతో ఫైరింజన్ వచ్చేలోపు గడ్డివాములు కాలి బూడిదయ్యాయి. పశువు ల కోసం గడ్డి, జొన్నచొప్ప వాములుగా నిల్వ చేసుకుంటే అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రూ. 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు తెలిపారు. అధికారులు తమ ను ఆదుకోవాలని కోరుతున్నారు.
రేపు ప్రజా ఫిర్యాదుల
పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదు ల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజ లు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలు సుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekoram. ap.gov.in అనే వెబ్‌సైట్‌లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చన్నారు.
నేడు వీరభద్రస్వామి,
కాళికాదేవిల కల్యాణం
ఆస్పరి: వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మండలంలో కైరుప్పల గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున వీరభద్రస్వామి, కాళికాదేవిల కల్యాణ మహోత్సవం నిర్వహించునున్నట్లు ఆలయ ఈఓ రాంప్రసాద్ శనివారం తెలిపారు. కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని, ఈ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. శనివారం భక్తులు పెద్ద ఎత్తున స్వామిని దర్శించుకున్నట్లు వెల్లడించారు.
వంద శాతం పన్ను
వసూళ్లే లక్ష్యం
కర్నూలు(అర్బన్): జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఈ ఆర్థిక సంవత్సరం ( ఈ నెల 31వ తేదీ) ముగిసే నాటికి వంద శాతం పన్ను వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంతో పాటు అరియర్స్ కలుపుకొని మొత్తం రూ.19.01 కోట్లను వసూలు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో 3,59,800 అసెస్‌మెంట్స్‌కు ఇప్పటి వరకు 3,14,493 అసెస్‌మెంట్స్‌ను కలిసి రూ.15.78 కోట్లను ( 83.02 శాతం) వసూలు చేశారన్నారు. మిగిలిన రూ. 3.22 కోట్లను ఈ నెలాఖరులోగా వసూలు చేయాల్సి ఉందన్నారు. పన్ను వసూలుకు క్షేత్ర స్థాయిలోని డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు ఈ వారం రోజులు కష్టపడాలన్నారు. గూడూరు మండలంలో వంద శాతం వసూలు కాగా.. నందవరం, మంత్రాలయం, పెద్దకడుబూరు, కోడుమూరు, ఓర్వకల్, సి.బెళగల్, చిప్పగిరి, తుగ్గలి మండలాలు 90 శాతం దాటాయన్నారు. మిగిలిన మండలాలు కూడా దాదాపు లక్ష్యానికి చేరువలో ఉన్నాయని, అందరూ లక్ష్యాన్ని సాధించాలన్నారు.


