బేతంచెర్ల: ఆర్‌ఎస్ రంగాపురం శివారులో వెలసిన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం స్వామి, అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు. స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజ చేశారు. ఉపకమిషనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
మహ్మద్ ప్రవక్త బోధనలు మార్గదర్శకం
కర్నూలు(సెంట్రల్): మహ్మద్ ప్రవక్త బోధనలు సమస్త ప్రజలకు మార్గదర్శకమని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. శనివారం ఆయన రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పాత ఈద్గాలో సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో అనుసరించిన క్రమశిక్షణ, సోదర భావం, పేదలకు సహాయం చేయడం వంటి అంశాలను మున్ముందు కూడా కొనసాగించాలని సూచించారు. అంతకముందు ఆయన ప్రార్థనలకు వచ్చిన వారిని ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.


