గ్యాస్‌కు బదులు విద్యుత్‌ స్టౌలు మేలు | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌కు బదులు విద్యుత్‌ స్టౌలు మేలు

Mar 21 2026 5:16 AM | Updated on Mar 21 2026 5:16 AM

గ్యాస్‌కు బదులు విద్యుత్‌ స్టౌలు మేలు ‘పది’ ఇంగ్లిష్‌ పరీక్ష 2కు వాయిదా

ప్రజలకు అవగాహన కల్పించాలి

మండలాధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్‌

కర్నూలు(సెంట్రల్‌): ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో ప్రజలు గ్యాస్‌కు బదులుగా ఇండక్షన్‌ లేదంటే విద్యుత్‌ స్టౌలను వినియోగించేలా అవగాహన కల్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి ఎల్‌పీజీ గ్యాస్‌ అంశంపై డివిజన్‌, మండల స్థాయి అధికారులతో శుక్రవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్యాస్‌ బదులుగా మట్టి, కట్టెల పొయ్యిలువాడొద్దని సూచించారు వాటి ద్వారా మహిళలకు ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకావం ఉంద న్నారు. అడవులు నరికివేతకు గురికాకుండా ఇండక్షన్‌, విద్యుత్‌ స్టౌలు వాడాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం విద్యుత్‌ సరఫరా సమృద్ధిగా ఉన్న నేపథ్యంలో వాటిని వాడుకోవడం మంచిదన్నారు. జేసీ నూరుల్‌ ఖమర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో గ్యాస్‌ కొరత లేదన్నారు. యుద్ధం నేపథ్యంలో ప్రజలు అపోహలకు గురై ఎక్కువ మోతాదులో సిలిండర్లను బుక్‌ చేసుకుంటున్నారన్నా రు. గతంలో జిల్లాలో ప్రతిరోజు 9 వేల సిలిండర్లు మాత్రమే అవసరం ఉండేదని, ప్రస్తుతం 11వేల సిలిండర్లు బుక్‌ చేసుకుంటున్నారని చెప్పారు. గ్యాస్‌ ఏజెన్సీ లు సిలిండర్లను దారి మళ్లిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కమర్షియల్‌ ట్యాక్స్‌ జేసీ నీరజ, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీపీఓ భాస్కర్‌, డీఎస్‌ఓ రాజారఘువీర్‌, జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మీ పాల్గొన్నారు.

నంద్యాల(న్యూటౌన్‌):పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో భాగంగా ఈనెల 21న శని వారం నిర్వహించాల్సిన ఇంగ్లిష్‌ పరీక్ష రంజాన్‌ సందర్భంగా సెలవు ప్రకటి స్తూ ఏప్రిల్‌ 2వ తేదీకి వాయిదా వేసినట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. అన్ని పరీక్షలు ముగిశాక ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని పది పరీక్షలు రాస్తున్న విద్యార్థులు,ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు తెలియజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్ష తేదీ మార్పు చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement