కుంభోత్సవానికి కొబ్బరికాయల సమర్పణ | - | Sakshi
Sakshi News home page

కుంభోత్సవానికి కొబ్బరికాయల సమర్పణ

Mar 21 2026 5:16 AM | Updated on Mar 21 2026 5:16 AM

కుంభోత్సవానికి కొబ్బరికాయల సమర్పణ

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల శ్రీ భ్రమరాంబా దేవి అమ్మ వారికి ఈనెల 7వ తేదీన నిర్వహించే కుంభోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆలయ ఉద్యో గి కొబ్బరి కాయలు సమర్పించారు. అమ్మవారికి సాత్త్వికబలి నిర్వహించేందుకు (కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మొదలగునవి సమర్పించడం) ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితీ. కుంభోత్సవం రోజున సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం. కాగా ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ముందుగా అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమలతో వాటికి పూజలు జరిపించారు. తరువాత అమ్మవారికి ఈ కొబ్బరికాయలు సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement