● క్రిష్ణగిరిలో అత్యధికంగా 39.2 మి.మీ వర్షపాతం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు 18 మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. క్రిష్ణగిరిలో 39.2 మి.మీ వర్షపాతం నమోదైంది. గూడూరు, హాలహర్వి, తుగ్గలి, ఆదోని, కల్లూరు, ఓర్వకల్, కర్నూలు అర్బన్‌లో తేలికపాటి వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తం మీద 7.8 మి.మీ వర్షపాతం నమోదైంది. పెద్దకడుబూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం తదితర మండలాల్లో మిర్చి ఇప్పటికీ కళ్లం దొడ్లు, పొలాలు, రోడ్లపై ఆరబెట్టుకున్నారు. బుధవారం సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో మిర్చి పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు.
మండలం వర్షపాతం
వెల్దుర్తి 28.4
నందవరం 21.8
ఎమ్మిగనూరు 19.2
చిప్పగిరి 15.8
గోనెగండ్ల 14.6
పెద్దకడుబూరు 12.2
మంత్రాలయం 8.8
మద్దికెర 7.8
కోడుమూరు 7.4


