824 మంది ఉల్లి రైతులకు అందని పరిహారం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో 824 మంది ఉల్లి రైతులకు పరిహారం విడుదల కాలేదని జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలో 31,352 మంది ఉల్లి రైతులకు ఎకరాకు 20 వేల ప్రకారం విడుదల అయిందని తెలిపారు. ఇందులో 30,528 మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాలకు జమ అయిందని తెలిపారు. 824 మంది రైతులకు మాత్రమే బ్యాంకు ఖాతాల్లో తప్పులు ఉండటం వల్ల జమ కాలేదని తెలిపారు. ఈ రైతుల వివరాలను సంబంధిత రైతు సేవా కేంద్రాలకు పంపామని రైతులు చెక్ చేసుకొని బ్యాంకు ఖాతాలను యాక్టివ్ చేసుకోవడం, ఆధార్ లింక్ చేసుకోవడం చేసుకోవాలని సూచించారు.
కర్నూలు(అర్బన్): ప్రజలకు మెరుగైన సేవలను వేగవంతంగా అందించేందుకే ప్రభుత్వం ఈ – గవర్నెన్స్ సిస్టమ్‌ను తీసుకొచ్చిందని డీపీఆర్‌సీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మంజులవాణి అన్నారు. మంగళవారం స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని డీపీఆర్‌సీ భవనంలో ఎంపీడీఓ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన జూనియర్ సహాయకులు, పరిపాలనాధికారులకు ఈ – గవర్నెన్స్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏపీఎస్‌ఐఆర్‌డీ అండ్ పీఆర్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఒకే వేదిక నుంచే ఆన్‌లైన్ అప్లికేషన్లను అన్ని శాఖల సమన్వయంతో ఈ గవర్నెన్స్‌పై అవగాహన పెంచుకోవాలన్నారు. నేషనల్ మోబైల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా క్షేత్ర స్థాయిలో ఉపాధి కూలీల హాజరును ఖచ్చితత్వంతో జీయోట్యాగ్‌తో నమోదు చేయవచ్చునన్నారు. శిక్షణా కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ మేనేజర్ గిడ్డేష్, సీనియర్ సహాయకులు వేణుగోపాల్, టీఓటీలు ఆస్రఫ్‌బాష, పి. జగన్నాథం, ఖలీలుల్లా, కె. జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


