పెట్రోల్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట
● జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
కర్నూలు (సెంట్రల్): సరిహద్దు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి అక్రమంగా పెట్రోలియం రవాణా కాకుండా కట్టడి చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను ఏర్పా టు చేశామని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో అక్రమ పెట్రోలియం రవాణాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రొటెక్షన్ కమిటీతో జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి అక్రమంగా, అనుమతి లేకండా పెట్రోలియంను తరలించి ఇక్కడ విక్రయిస్తున్నారన్నారు. కర్ణాటకలో ధరలు తక్కువగా ఉండటం వల్ల ఇలా చేస్తున్నారని, దీని వల్ల రాష్ట్రానికి పన్ను ఆదాయం తగ్గడమే కాకుండా సరఫరాలో అంతరా యం కలుగుతుందన్నారు. దీనిని అరికట్టడానికి సివిల్ సప్లయిస్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు జాయింట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. సంబంధిత కమిటీలో రవాణా శాఖ, లీగల్ మెట్రాలజీ శాఖ, సివిల్ సప్లయిస్ శాఖ, కమర్షియల్ టాక్స్ శాఖ లు నాలుగు విభాగాలుగా కలసి పనిచేస్తాయన్నారు. సమావేశంలో డీటీసీ శాంతకుమారి, కమర్షియల్ ట్యా క్స్ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు, ఆయి ల్ కంపెనీ మేనేజర్లు పాల్గొన్నారు.


