సీమ ప్రాజెక్ట్‌లను తెలంగాణకు తాకట్టుపెట్టారు!
బొమ్మలసత్రం: రాయలసీమ రైతాంగం కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డుకోవడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. సోమ వారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశానికి కాటసానితో పాటు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, ఎస్‌ఈసీ సభ్యులు పీపీ నాగిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేశం సుధాకర్‌రెడ్డి, రాయలసీమ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దాల్‌మిల్ అమీర్, సూర్యనారాయణరెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో కాట సాని రాంభూపాల్‌రెడ్డి.. మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి చంద్రబాబునాయుడు రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారన్నా రు. ఆయన సొంత ప్రయోజనాల కోసం సీమ ప్రాంతానికి వెన్నుపోటు పొడవడం బాధాకరమన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజక్ట్ పనులను చంద్రబాబు రహస్య ఒప్పందం చేసుకొని అడ్డుపడటం సరైందికాదన్నారు. ఈనెల 3వ తేదీ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో చంద్రబాబు ద్వంద వైఖరి బయటపడిందన్నారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టిన ఘటన బాబుకే దక్కుతుందన్నారు. గతంలో పోలవరం ప్రాజెక్ట్‌లో కమీషన్ల కోసం కక్కుర్తి పడి ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టారని, ఇప్పుడు స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ పథకాన్ని అడ్డుకున్నారన్నారు. తెలంగాణలో శ్రీశైలం నుంచి 798 అడుగుల నుంచే విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటిని కిందకు వదిలేస్తోందని, అంతేకాకుండా శ్రీశైలం నుంచి 800 అడుగుల నుంచే నీళ్లు ఎత్తిపోసేందు కు పలు ప్రాజెక్ట్‌లు చేపట్టారన్నారు. వారిని చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. 2019కి ముందు చంద్రబాబు ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణ వైపు పాలమూరు, రంగారెడ్డి లాంటి పలు ప్రాజెక్ట్‌ల ద్వారా శ్రీశైలం నీటిని తరలించే పనులు ప్రారంభమయ్యాయన్నారు. వీటిని ప్రశ్నిస్తే ఓటుకు కోట్లు కేసులో అరెస్ట్ చేస్తారో అన్న భయంతో బాబు రాష్ట్రానికి పారిపోయి వచ్చారన్నారు. 2019 తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో రాయలసీమ తాగు, సాగు నీటి అవసరాల కోసం పలు ప్రాజెక్ట్‌ల నిర్మాణాలను మొదలుపెట్టారన్నారు.
ప్రాజెక్ట్‌లపై నిద్రిస్తే నేల తడవదు..
ప్రాజెక్ట్‌లపై నిద్రించి రాష్ట్రానికి మేలు చేశానని చెబుతున్న సీఎం చంద్రబాబు ఇంతవరకూ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేసిన దాఖాలాలు లేవని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో శ్రీశైలం నుంచి కేవలం 5 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తుండగా దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ హయాంలో 11 వేల క్యూసెక్కులు పెంచారన్నారు. ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏకంగా 44 వేల క్యూసెక్కుల నీరు తరలించేలా కృషి చేశారని కొనియాడారు. కృష్ణా జలాలను ఒడిసి పట్టి ప్రజలకు నీరు అందించాలన్న లక్ష్యంతో మాజీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజోలి, జోళదరాశి ప్రాజెక్ట్‌ల నిర్మాణం కోసం భూసేకరణ పనులు కూడా పూర్తి చేశారన్నారు. ఓటుకు కోట్లు కేసులకు భయ పడి చంద్రబాబు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
రాయలసీమ ఎత్తిపోతలపై
బయటపడిన బాబు ద్వంద్వవైఖరి
దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ వల్లే
సీమకు ప్రాజెక్ట్‌లు
సాగునీటి కోసం పార్టీలకతీతంగా
ఉద్యమించాలి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
కాటసాని రాంభూపాల్‌రెడ్డి


