ఒక్క స్థానం లేకపోయినా.. ఎంపీపీ పీఠంపై గురి | - | Sakshi
Sakshi News home page

ఒక్క స్థానం లేకపోయినా.. ఎంపీపీ పీఠంపై గురి

Jan 6 2026 7:15 AM | Updated on Jan 6 2026 7:15 AM

ఒక్క స్థానం లేకపోయినా.. ఎంపీపీ పీఠంపై గురి

ఒక్క స్థానం లేకపోయినా.. ఎంపీపీ పీఠంపై గురి

జూపాడుబంగ్లా ఎంపీపీపై అవిశ్వాస

తీర్మానానికి టీడీపీ కుట్ర

జూపాడుబంగ్లా: తెలుగు దేశం పార్టీకి మండలంలో ఒక్కటంటే ఒక్క ఎంపీటీసీ స్థానం లేకపోయినా ఆ పార్టీ నేతలు ఎంపీపీ పీఠాన్ని దక్కించుకునేందుకు కుట్ర పన్నారు. ఈ మేరకు సోమవారం మండలంలోని ఆరుగురు ఎంపీటీసీలను జతచేసుకొని టీడీపీ నేతలు ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతికి అవిశ్వాస తీర్మానం ప్రతిని అందజేసినట్లు సమాచారం. మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలుండగా 2021 ఏప్రిల్‌ లో జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో 9 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. తాటిపాడు, పారుమంచాల గ్రామాల్లో ఇండిపెండెంటు అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీకి ఒక్కటంటే ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా దక్కించుకోలేకపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం కొంత మంది ఎంపీటీసీ సభ్యులు ప్రస్తుత ఎమ్మెల్యే, ఎంపీ వర్గాల్లో చేరారు. వారిలో ఆరుగురిని తమవైపు తిప్పుకొని ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు యత్నిస్తున్నారు. అయితే మరో నాలుగు మాసాల్లో పాలక మండలి గడువు ముగుస్తున్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుండటం వెనుక ఆంత్యమేమిటని పలువురు చర్చించుకుంటున్నారు. ఆర్డీఓ నాగజ్యోతికి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ప్రతిలో మండ్లెం–2, జూపాడుబంగ్లా–1, 2, పారుమంచాల, తరిగోపుల, తంగడంచ ఎంపీటీసీలు సంతకాలు చేశారని తెలుస్తోంది. కాగా మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు గాను తాటిపాడు ఎంపీటీసీ బోయ చిన్నశంకర్‌ మృతిచెందగా, తర్తూరు ఎంపీటీసీ పీఎం నాగిరెడ్డి సర్పంచ్‌గా ఎన్నికవ్వటంతో ఎంపీటీసీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం తొమ్మిది సభ్యులుండగా అందులో 2/3 ప్రకారంగా ఆరుగురు సభ్యులు మెజార్టీ తెలిపితే ఎంపీపీపై అవిశ్వాసం నెగ్గుతోంది. ఈ క్రమంలో మెజార్టీ సభ్యులు ఇచ్చిన తీర్మానం ప్రతులను ఆర్డీఓ పరిశీలించి ఎంపీటీసీ సభ్యులదంరికీ నోటీసులిచ్చి వారంలోగా సభను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement