మదిమదిలో ‘మహా’ భక్తి
అర్ధనారీశ్వరుడు.. అద్వైతుడు.. మహా దేవుడు.. శ్రీ నీలకంఠేశ్వరస్వామి భక్తుల మధ్యకే వచ్చారు. మహా రథం నుంచి ప్రజలందరినీ దీవించారు. చేనేతపురి ఎమ్మిగనూరులోని తేరుబజారు సోమవారం ఆధ్యాత్మిక దీప్తితో ప్రభవించింది. పండితుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల సుస్వరాల సమ్మేళనం మధ్య మహారథోత్స వం అంగరంగ వైభవంగా సాగింది. మదిమదిలో ‘మహా’ భక్తి వెల్లివిరిసింది. రథోత్సవంలో రెండు లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నారు. రథాన్ని లాగి స్వామివారి కృపను పొందా లని పోటీపడ్డారు. రథంపై డ్రోన్‌తో పూలను చల్లడం విశే షంగా ఆకట్టుకొంది. ఉత్సవాన్ని తిలకించేందుకు పలుచో ట్ల ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. నందికోళ్ల సేవ, గొరవయ్యల నృత్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు


