కాపురం చేయాలంటే అదనపు కట్నం ఇవ్వాలట
● జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్‌కు
బాధితురాలి ఫిర్యాదు
నంద్యాల: కాపురం చేయాలంటే అదనపు కట్నం ఇవ్వాలని తన భర్త వేధిస్తున్నాడని గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన ఓ మహిళ జిల్లా ఎస్పీ సురేష్ షెరాన్‌కు ఫిర్యాదు చేశారు. విచారించి న్యాయం చేయాలని ఆమె కోరారు. సోమవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఎస్పీ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చట్ట పరిధిలోని సమస్యలకు తక్షణమే గడువు లోపల పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన 78 సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


