జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కామ
నంద్యాల(అర్బన్): జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కామేశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రామచంద్రారావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు.. ఆదివారం స్థానిక నిశాంత్ భవన్‌లో నంద్యాల జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. సంఘంలో మొత్తం 21 పోస్టులకు 21 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో అందరూ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి నాగరాజు తెలిపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు కామేశ్వరరెడ్డి, రామచంద్రారావులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి రెండవ సారి తమను జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకోవడం అభినందనీయమన్నారు. అసోసియేషన్ సభ్యుల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎన్నికై న వారిలో సహ అధ్యక్షులుగా ప్రసాద్‌బాబు, ఉపాధ్యక్షులుగా సత్యదీప్, మధుసూదన్, స్వప్న, రబ్బాని, కోశాధికారిగా నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏ రామచంద్రారావు, సంయుక్త కార్యదర్శిగా రామసంజీవరావు, శ్రీనివాసరెడ్డి, సురేష్‌నాయుడు, అల్లాబకాష్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా చంద్రానాయక్, కార్యనిర్వాహక సభ్యులుగా నాగాంజనేయులు, వెంకటరమణ, బ్రహ్మం, మహేష్‌కుమార్, అనూష, అరవింద్, కొండారెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికై న సభ్యులను పలువురు సన్మానించారు.


