ప్రాణం తీసిన అప్పులు
మహానంది: నందిపల్లె గ్రామానికి చెందిన రైతు సద్దల రామపుల్లయ్య (44)ను అప్పులు మింగేశాయి. ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సద్దల రామపుల్లయ్య సుమారు పది ఎకరాల్లో వరి, ఇతర పంటలను సాగు చేశాడు. ఇటీవల కాలంలో అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని దిగుబడులు తగ్గి తీవ్ర నష్టాలు చవిచూశాడు. దీంతో అప్పులు ఎక్కువ కావడంతో బ్యాంకుల్లో బంగారు పెట్టి తీసుకున్న రుణంతో పాటు బయట తీసుకున్న అప్పులన్నీ కలిపి సుమారు రూ. 15 లక్షలకు పైగా ఉన్నాయి. ఈ మేరకు అప్పులు ఎక్కువ కావడంతో తీర్చలేనన్న మనస్తాపంతో శనివారం గడ్డిమందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు కర్నూ లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం మృతి చెందినట్లు ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. మృతుడి భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహానిన బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.


