తప్పుల తడకగా పాస్ పుస్తకాలు
కొలిమిగుండ్ల: రాజ ముద్ర పేరుతో చంద్రబాబు ప్రభుత్వం రైతులకు పంపిణీ చేస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాల్లో భూముల వివరాలు తప్పుల తడకగా ఉన్నాయని రైతులు వాపోతున్నారు. శుక్రవారం మీర్జాపురంలో రెవెన్యూ అధికారులు గ్రామ సభ నిర్వహించి పాస్ పుస్తకాల పంపిణీ చేశారు. బుక్‌లో చూసే సరికి చాలా లోపాలు దర్శనమిచ్చాయి. గ్రామానికి చెందిన గువ్వల శ్రీకాంత్‌రెడ్డి అనే రైతుకు 103/68 సర్వే నంబర్‌లో 6.70 ఎకరాల భూమి ఉంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అంతే భూమితో కూడిన పాస్ పుస్తకం ఇచ్చారు. ఇప్పుడేమో రాజముద్ర ముద్రించి ఇచ్చిన కొత్త బుక్‌లో 6.12 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు చూపుతుందని రైతు వాపోయాడు. గ్రామంలో పలువురి రైతులకు చెందిన పొలాల విస్తీర్ణంలో చాలా తేడాలు వచ్చాయని రెవెన్యూ సిబ్బందిని నిలదీశారు. కొత్తగా ఈ ప్రభుత్వం చేసింది ఏమి అని రైతులు ప్రశ్నించారు. విస్తీర్ణం తక్కువగా ఉన్న రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని రెవెన్యూ అధికారులు సూచించారు.
తప్పుల తడకగా పాస్ పుస్తకాలు


