రోడ్లు వేస్తే టీడీపీ నాయకులు వేధిస్తారా?
పాణ్యం: ‘ప్రజలు ఇబ్బంది పడుతున్నారని జెడ్పీ నిధులతో రోడ్లు వేస్తే టీడీపీ నాయకులు వేధిస్తారా’ అంటూ తిరుమలగిరి వాసులు శనివారం పాణ్యం ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. పాణ్యంలో తిరుమలగిరి కాలనీ 15 ఏళ్ల క్రితం ఏర్పడిందన్నారు. కాలనీలో సీసీ రోడ్లు వేయాలని ఇటీవల జెట్పీటీసీ సద్దల సరళమ్మ దృష్టికి తీసుకెళ్లగా రూ.10 లక్షల జెడ్పీ నిధులు కేటాయించారన్నారు. ఈ నిధులతో కాలనీలో సీసీరోడ్లు వేయడంతో స్థానిక టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారని, పదేపదే ప్రభుత్వ కార్యాలయంలోకి వెళ్లి తనిఖీ చేస్తున్నారన్నారు. రోడ్లు ఎందుకు వేశారని ప్రజలను మానసికగా ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు. అనంతరం జెట్పీటీసీ సభ్యులు సద్దల సరళమ్మ, మాజీ జెట్పీటీసీ సద్దల సూర్యనారాయణరెడ్డి, ఎంపీపీ ఉసేన్‌బీ, సర్పంచ్ మేకల పల్లవిలతో కలిసి కాలనీల వాసులు ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్‌కు వినతి పత్రం అందించారు. మరిన్ని కాలనీలో సీసీరోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఇదే విషయమైన సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిశారు. ఇష్టానుసారంగా మమల్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీడీపీ, ఇతర నాయకులపై కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు.


