అదనంగా వసూలు చేసిన డబ్బులు వెనక్కి
సాక్షి టాస్క్‌ఫోర్స్: యూరియా విక్రయాల్లో అదనంగా వసూలు చేసిన డబ్బును రైతులకు అధికారులు వెనక్కి ఇప్పించారు. ‘ఓరి నాయనో..యూరియా లేదంట’ అనే శీర్షికన సాక్షి దినపత్రికలో శుక్రవారం వచ్చిన వార్తకు అధికారులు స్పందించారు. హనుమంతుగుండం సొసైటీ వద్దకు వచ్చి వ్యవసాయ శాఖ కోవెలకుంట్ల ఏడీ సుధాకర్‌రెడ్డి, కొలిమిగుండ్ల ఏఓ శారదాదేవి విచారణ జరిపారు. సొసైటీ చైర్మన్ యూరియాపై అధికంగా వసూలు చేసినట్లు తేలింది. సొసైటీ పరిధిలోని గ్రామాల రైతులను సమావేశ పర్చి అదనంగా వసూలు చేసిన రూ.12,236,60, నానో డీఏపీలకు సంబంధించిన రూ.30 వేలను రైతులకు తిరిగి వెనక్కి ఇచ్చేశారు.
అదనంగా వసూలు చేసిన డబ్బులు వెనక్కి


