అప్పుల భారంతో ఆత్మహత్య
కోసిగి: వందగల్లు గ్రామానికి చెందిన కోసిగి రామాంజనేయులు(28) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామాంజనేయులు, భార్య నాగతేజ వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నారు. కాగా అప్పుల భారంతో మానసిక ఒత్తిడికి గురై గత నెల 31వ తేదీన గ్రామ శివారులోని పొలంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితితో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ కోలుకోలేక శనివారం ఉదయం మృతి చెందాడు. మృతుడు తండ్రి పెద్ద నరసప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్ రెడ్డి తెలిపారు.


