దేదీప్యమానం హనుమత్ ధర్మ జ్యోతి
కర్నూలు కల్చరల్: నగరం శివారులోని రూపాల సంగమేశ్వర జగన్నాథ గట్టుపై హనుమత్ ధర్మ జ్యోతి దేదీప్యమానంగా వెలిగింది. విశ్వ హిందూ పరిషత్, రూపాల సంగమేశ్వర జగన్నాథ గట్టు అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో పౌర్ణమిని పురస్కరించుకుని శనివారం రాత్రి జగన్నాథ గట్టుపై ఉన్న 67 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద హనుమత్ ధర్మజ్యోతి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అక్కడే స్వామివారికి అభిషేకం, మన్యసూక్త హోమం, సామూహిక హనుమాన్ చాలీసా పారాయ ణం కార్యక్రమాలు జరిగాయి. వీహెచ్‌పీ పూర్వపు అంతర్జాతీయ అధ్యక్షులు జి.రాఘవరెడ్డి, వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి, జిల్లా అధ్యక్షులు మద్దిలేటి, లలి తా పీఠం వ్యవస్థాపకులు మేడా సుబ్రహ్మణ్యస్వామి, ప్రతాపరెడ్డి తదితరులు శ్రీహనుమ త్ ధర్మ జ్యోతిని వెలిగించారు. అంతకు ముందు నగరంలోని భరతమాత ఆలయం నుంచి జగన్నాథగట్టు వరకు శోభా యాత్ర సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
దేదీప్యమానం హనుమత్ ధర్మ జ్యోతి


