జాతీయ కథల పోటీల్లో పోలకల్ విద్యార్థిని ప్రతిభ
సి.బెళగల్: పోలకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 7వ తరగతి విద్యార్థిని శ్రావణి జాతీయ కథల పోటీలలో ప్రతిభ కనపరిచింది. పాఠశాల హెచ్‌ఎం రమ తెలిపిన వివరాల మేరకు.. గతేడాది నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ సారస్వత పరిషత్ వారు నిర్వహించిన కథల పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి 450 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో 12 మంది కథలు ఎంపిక కాగా.. శ్రావణి రాసిన ‘దేవత హారం’అనే కథకు బహుమతి లభించింది. తెలంగాణ సారస్వత పరిషత్ వారు విద్యార్థినికి రూ.500 నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం, రూ.500 విలువైన పుస్తకాలు ఇచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం శ్రావణికి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. కథ రాయడం నేర్పించిన తెలుగు ఉపాధ్యాయులు రామాంజనేయులు, మిణిక్యమ్మ, వెంకటరమణగౌడ్, హరికృష్ణలను హెచ్‌ఎం, స్కూల్ టీచర్లు ప్రత్యేకంగా అభినందించారు.
సీమ సాగునీటి హక్కుల సాధనలో చైతన్యం రావాలి
నంద్యాల(అర్బన్): రాయలసీమ సాగునీటి హక్కుల సాధనలో ప్రజల్లో చైతన్యం రావాల ని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. స్థానిక సమితి కార్యాలయంలో శుక్రవారం సీమను సస్యశ్యామలం చేసి ప్రజలను చైతన్యవంతం చేసేలా రాయలసీమ నీటి హక్కుల కోసం ఆడియో పాటను చిన్నారి చేత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 14 ఏళ్లుగా రాయలసీమ సాగునీటి సాధన సమితి అనేక రైతులకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. గుండ్రేవుల రిజర్వాయర్, ఆర్‌డీఎస్ కుడికాల్వ, వేదావతి ఎత్తి పోతల పథకాలకు పాలన అనుమతులు సాధించడంతో పాటు పులికనుమ ప్రాజెక్టు సత్వర నిర్మాణం చేయడంలోను కృషి చేసిందన్నారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు శంకర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, మహేశ్వరరెడ్డి, సుధాకర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
భక్తుల వసతికి పెద్దపీట
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి తరలివచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు అన్నారు. మంత్రాలయంలో టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా మరో 200 అదనపు గదులను నిర్మిస్తున్న భవనాలను పీఠాధిపతి పరిశీలించారు. అదే ప్రాంగణంలో భక్తులకు డార్మిటరీ హాల్ నిర్మిస్తామన్నారు. నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్ని అధికారులను ఆదేశించారు. మంత్రాలయం వచ్చే క్షేత్ర పరిధిలో భక్తులు స్వచ్ఛతను పాటించాలన్నారు. ఆయన వెంట శ్రీ మఠం ఇంజినీర్, సురేష్ కోనాపూర్, బద్రి బెంగళూరుకు చెందిన సుబ్బన్న పాల్గొన్నారు.
జాతీయ కథల పోటీల్లో పోలకల్ విద్యార్థిని ప్రతిభ
జాతీయ కథల పోటీల్లో పోలకల్ విద్యార్థిని ప్రతిభ


