ఊరంతా పందిరిలా..
దూరం నుంచి చూస్తే ఏదో వేడుక సందర్భంగా పెద్ద పందిరి వేశారా అన్నట్లుగా ఆ దృశ్యాలు కనిపిస్తాయి. వాటిని సమీపిస్తుంటే ఎవరైనా సంచారం చేస్తూ గుడారాలు వేసుకున్నారా అన్నట్లు ఉంటాయి. దగ్గరికి వెళ్తే కానీ అసలు విషయం అర్థం కాదు. టి. గోకులపాడు గ్రామంలో 80 శాతం నల్లరేగడి పొలాలు కావడంతో చాలా మంది రైతులు పొగాకు సాగు చేశారు. అయితే
పంట నుంచి తీసిన ఆకును ఎవ్వరి పొలంలో వారు వేసుకోకుండా అందరూ గ్రామానికి సమీపంలోని ఓ పొలంలో ఇలా పదుల సంఖ్యలో పందిర్లు వేశారు. అందులో పొగాకు తోరణాలు కట్టి ఆరబెట్టారు. ఈ రహదారి మీదుగా వెళ్లే వాహనదారులను ఈ పందిర్లు ఆకట్టుకుంటున్నాయి. – కృష్ణగిరి


