రెడ్డి సమ్మేళనం విజయవంతం చేయాలి
కర్నూలు(అర్బన్): భక్త మల్లారెడ్డి గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1వ తేదీన తిరుపతి వేదికగా జరగనున్న అంతర్జాతీయ రెడ్డి ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేద్దామని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎన్.సుమతీ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పల్లె శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రెడ్డి సమాజం ఒకే కుటుంబంలా ఐక్యంగా ఉన్నప్పుడే రాజకీయ, సామాజిక, ఆర్థి కంగా బలపడుతుందన్నారు. ఈ ఏడాది రెడ్డి యువ త, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామన్నారు. చారిత్రక సమ్మేళనానికి ఉమ్మడి జిల్లా నుంచి అన్ని రెడ్డి సంఘాల నాయకులు, యువత, మహిళ లు పెద్ద సంఖ్యలో హాజరై ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు సుమతీరెడ్డిని ఘనంగా సన్మానించారు. సమ్మేళనానికి సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర సంఘటన కార్యదర్శి తూముకుంట ప్రతాప రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దం రాజారెడ్డి, నగర అధ్యక్షుడు రజనీకాంత్‌రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు హరినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


