ప్రభుత్వమే ఆదుకోవాలి
నల్లి తెగులు ఎక్కువై మిర్చి వంట దెబ్బతింది. నేను 12 ఎకరాల్లో మిర్చి సాగుచేశా. భారీ వర్షాలకు పాలంలో నీరు నిలబడి మొక్కలు చనిపోయాయి. ఎకరాకు సుమారు రూ.లక్ష పైనే ఖర్చుచేశా. ఇప్పుడు తెగుళ్లతో దిగుబడి ఎలా ఉంటుందోనని భయమేస్తోంది. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.
–మదన్‌మోహన్, తొగర్చేడు, పాణ్యం మండలం
మిరప తోటలు బాగున్నాయని అనుకుంటున్న తరుణంలో అకాల వర్షాలు దెబ్బతీశాయి. అరకొర దిగుబడులు వచ్చాయి. మొదటి కోతలో ఎకరాకు 3 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. రెండు, మూడు కోతల్లో అంతం మాత్రంగానే వస్తుంది. ఈ ఏడాది కూడా నష్టపోవాల్సి వచ్చింది.
–బాల చిన్ని, గడివేముల
ప్రభుత్వమే ఆదుకోవాలి


