కుందూ కరకట్ట అనకొండలపై చర్యలేవి?
కోవెలకుంట్ల: కుందూనది కరకట్ట గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్న అనకొండలపై అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. స్థానిక టీడీపీ నాయకులు అక్రమార్కులతో చేతులు కలిపి టిప్పర్లతో గ్రావెల్ తరలించి కోట్లాది రూపాయాలు దండుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కోవెలకుంట్ల పట్టణ శివారులోని కుందూనది పరివాహక ప్రాంతంలోని కరకట్టను ఆయన పరిశీలించారు. పెద్ద పెద్ద ప్రొక్లెయిన్లు ఏర్పాటు చేసి టిప్పర్ల సాయంతో గ్రావెల్‌ను తరలిస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కాటసాని మాట్లాడుతూ ఎనిమిదేళ్ల క్రితం ప్రజా సంకల్పయాత్రలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోవెలకుంట్ల మీదుగా వెళ్తూ కుందూ ముంపు సమస్యను తెలసుకున్నారన్నారు. అధికారంలోకి రాగానే కుందూనది విస్తరణ పనులతో జిల్లాతో పాటు, వైఎస్సార్, జిల్లా ప్రజలు, రైతులకు ముంపు కష్టాలను శాశ్వతంగా తొలగించేందుకు కుందూనది విస్తరణ పనులకు రూ.1,350 కోట్ల నిధులు కేటాయించారన్నారు. అప్పట్లోనే నది విస్తరణ పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని నిప్పులవాగు నుంచి వైఎస్సార్ జిల్లా ఆదినిమ్మాయిపల్లె వరకు 183 కి.మీ మేర తొమ్మిది రీచ్‌లుగా విభజించి విస్తరణ పనులు పూర్తి చేశామన్నారు.
టీడీపీ నేతల అండతోనే యథేచ్ఛగా
గ్రావెల్ అక్రమ రవాణా
అధికారులు ఫిర్యాదు చేసి
తప్పుకోవడం సరికాదు
కుందూనది కరకట్ట ప్రాంతాన్ని
పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని
టీడీపీ నాయకులు, అధికారులపై ఫైర్


