క్షేత్రస్థాయి సర్వేలు కీలకం | - | Sakshi
Sakshi News home page

క్షేత్రస్థాయి సర్వేలు కీలకం

Dec 13 2025 7:29 AM | Updated on Dec 13 2025 7:29 AM

క్షేత

క్షేత్రస్థాయి సర్వేలు కీలకం

క్షేత్రస్థాయి సర్వేలు కీలకం

నందికొట్కూరు: జాతీయ స్థాయిలో విశ్వసనీయమైన గణంకాల తయారీకి క్షేత్రస్థాయి సర్వేలు చాలా కీలకమని నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ అదనపు డైరెక్టర్‌ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో జరుగుతున్న క్షేత్రస్థాయి సర్వేను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ చేపట్టిన గణంకాల కార్యక్రమం ఎంత ఉపయోగమన్నారు. ఈ సర్వే దేశ వ్యాప్తంగా ఉపాధి, నిరుద్యోగిత రేట్లను అంచనా వేయడానికి ఎన్‌ఎస్‌ఓ సర్వే ప్రతి ఏడాది ఉంటుందని చెప్పారు. పీఎల్‌ఎఫ్‌ఎస్‌ సర్వే కోసం ఎంపిక చేయబడిన గృహాలను సందర్శించామన్నారు. ఈ సర్వే దేశ ఆర్థిక విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ఆయన వెంట ఎన్‌ఎస్‌ఓ కర్నూలు ఉప ప్రాంతీయ కార్యాలయం సర్వే సూపర్‌వైజర్‌ సీ.బీ శ్రీనివాసులు, సర్వే ఎన్యుమరేటర్‌ నాగన్న, స్థానిక వీఆర్వోలు నర్సరాజు, హనుమంతు, వీఆర్‌ఏలు శ్రీను, సుధాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత

నంద్యాల: పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పోలీసు సంక్షేమ దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ సునీల్‌ షెరాన్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీసు సిబ్బంది సమస్యలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో నిమగ్నమైన పోలీసు సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పోలీస్‌ వెల్ఫేర్‌ డే కార్యక్రమం ద్వారా సిబ్బంది సమస్యలపై సత్వర చర్యలు తీసుకోని పరిష్కరిస్తున్నామన్నారు. విధులలో సిబ్బంది ఇబ్బంది పడకుండా వారి సమస్యల తొలగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

19లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి

నంద్యాల(న్యూటౌన్‌): ఓపెన్‌ పదవ తరగతి, ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజును అపరాధ రుసుం లేకుండా ఈనెల 19వ తేదీలోగా చెల్లించాలని డీఈఓ జనార్ధన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.25 అపరాధ రుసుంతో ఈనెల 20వ తేదీ వరకు, ఒక సబ్జెక్టుకు రూ.50 అపరాధ రుసుంతో 21 నుంచి 22వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. పదో తరగతి థియరీ సబ్జెక్టుకు రూ.100, ఇంటర్మీడియెట్‌ థియరీ సబ్జెక్టుకు రూ.150, ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ ఒక సబ్జెక్టుకు రూ.100 చెల్లించాలన్నారు. సబ్జెక్టుకు ఒక్కొక్కటి ఇంప్రూమెంట్‌కు ఐదేళ్ల కాలంలో ఒకసారి మాత్ర మే వినియోగించుకొనే అవకాశం ఉంటుందన్నా రు. ఒక థియరీ సబ్జెక్టుకు రూ.250, ఇంటర్మీడియె ట్‌ ప్రాక్టికల్‌ సబ్జెక్టుకు రూ.100, పదో తరగతి థియరీ ఒక సబ్జెక్టుకు రూ.200, ఇంటర్‌ థియరీ సబ్జెక్టుకు రూ.300, ప్రాక్టికల్‌ ఒక సబ్జెక్టుకు రూ.100 చెల్లించాలన్నారు. వివరాలకు ఓపెన్‌ స్కూల్‌ డిస్ట్రిక్ట్‌ కో ఆర్డినేటర్‌ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

ఉమీద్‌ వక్ఫ్‌ పోర్టల్‌ గడువు ఆరు నెలలు పెంపు

కర్నూలు (అర్బన్‌): ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉమీద్‌ వక్ఫ్‌ పోర్టల్‌లో వివరాల అప్‌లోడ్‌నకు గడువును మరో ఆరు నెలలు పొడిగించినట్లు రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ప్రధాన కార్యనిర్వాహక అధికారి షేక్‌ మొహమ్మద్‌ అలీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం రాష్ట్రంలోని అన్ని వక్ఫ్‌ సంస్థలు, వాటికి చెందిన అనుబంధ ఆస్తుల వివరాలను ఉమీద్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసే ప్రక్రియను జూన్‌ 6వ తేదీ నుంచి ప్రారంభించామని చెప్పారు. చివరి తేదీగా ఈ ఏడాది డిసెంబర్‌ 5గా నిర్ణయించబడిందని తెలిపారు. అయితే సాంకేతిక సమస్యలు, కొంత వక్ఫ్‌ ఆస్తుల రికార్డులు తెలంగాణ వక్ఫ్‌ బోర్డు నుంచి వివిధ కారణాలతో అందకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. వక్ఫ్‌ బోర్డు వారు దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్‌ పరిశీలించిన సమస్యలను పరిగణలోకి తీసుకుని గడువు పొడిగింపు ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీంతో ఉమీద్‌ పోర్టల్‌లో వక్ఫ్‌ సంస్థల వివరాలను వచ్చే ఏడాది జూన్‌ 6 వరకు పొడిగించబడిందని పేర్కొన్నారు.

క్షేత్రస్థాయి సర్వేలు కీలకం1
1/1

క్షేత్రస్థాయి సర్వేలు కీలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement