ఇంటింటా సంతకం.. ఊరూరా ఉద్యమం
బొమ్మలసత్రం: ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిన ప్రైవేటీకరణ చేయడాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. వివిధ దశల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టింది. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో రచ్చబండ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించింది. గ్రామ స్థాయి నుంచి ఈ కార్యక్రమం ప్రజా ఉద్యమంగా మారింది. ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొని తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గమనించిన చంద్రబాబు సర్కార్ వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలకు పోలీసులతో ఇబ్బందులు సృష్టించింది. పలు నిరసన కార్యక్రమాలకు హాజరుకాకుండా వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీసులు జారీ చేయడం, ఇంటికే పరిమితం చేయడం వంటి సంఘటలకు పాల్పడింది. అయినా ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరు బాట పట్టింది. గత అక్టోబర్ నెల 10న కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తి స్థాయిలో ఫార్మెట్‌ను తయారు చేసి ఇంటింటికి తిరిగి ప్రజల అభిప్రాయాన్ని సేకరించింది. ఇలా జిల్లా వ్యాప్తంగా 60 రోజులు నిర్వహించింది. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో రెండు నెలల పాటు నిర్విఘ్నంగా సాగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం తుది దశకు చేరుకుంది. తమ పిల్లల భవిష్యత్తు కోసం జిల్లా వ్యాప్తంగా 4.20 లక్షల మంది సంతకాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. నంద్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో, బనగానపల్లె నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, డోన్ నియోజకవర్గంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మె ల్యే గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి, శ్రీశైలంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, నందికొట్కూరులో పార్టీ ఇన్‌చార్జ్ దారా సుధీర్ ఆధ్వర్యంలో ఊరూరా సంతకాల సేకరణ ఉద్యమంలా సాగింది.
నేడు ర్యాలీగా సంతకాల ప్రతులు తరలింపు...
జిల్లా వ్యాప్తంగా పీపీపీకి వ్యతిరేకంగా ప్రజల నుంచి సేకరించిన సంతకాల ప్రతుల బాక్సులను ఈనెల 10వ తేదీ జిల్లా కార్యాలయానికి తరలించి పార్టీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డికి అప్పగించారు. వాటిని సోమవారం జిల్లా కేంద్రంలోని జీవీ షాపింగ్‌మాల్ ఎదురుగా ఉన్న జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఉదయం 9 గంటలకు ర్యాలీ గా తీసుకెళ్తారు. ఏడు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య బాక్సులను ర్యాలీ గా స్థానిక మున్సిపల్ కార్యాలయం వరకు తీసుకెళ్తారు. తర్వాత అక్కడి నుంచి విజయవాడ కేంద్ర కా ర్యాలయానికి వాహనాల ద్వారా తరలించనున్నా రు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్సార్‌సీపీ అధినేత ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన గవర్నర్‌కు అప్పగించడంతో కార్యక్రమం పూర్తి కానుంది.
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు వెనుకడుగు వేసేలా ఊరూరా జనం నిరసన సంతకం చేశారు. కోటి సంతకాల సేకరణతో బాబుకు కనువిప్పు కలగాలి. జిల్లా కేంద్రంలో సోమవారం జరిగే భారీ ర్యాలీకి పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజలు భారీగా తరలిరావాలి. స్థానిక జీవీ షాపింగ్‌మాల్ ఎదురుగా ఉన్న పార్టీ కార్యాలయం నుంచి ఉదయం 9 గంటలకు ర్యాలీ ప్రారంభమై మున్సిపల్ కార్యాలయం వరకూ కొనసాగుతుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నినాదాన్ని చంద్రబాబుకు అర్థం కావాలి. నాయకులు భారీ సంఖ్యలో హాజరై ర్యాలీని విజయవంతం చేయాలి.
– కాటసాని రాంభూపాల్‌రెడ్డి,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై జనాస్త్రం
జిల్లాలో కోటి సంతకాల సేకరణ
సంపూర్ణం
నంద్యాలలో నేడు భారీ ర్యాలీ
తరలిరానున్న ప్రజలు
కదంతొక్కనున్న
వైఎస్సార్‌సీపీ శ్రేణులు


