రిజర్వాయర్ రివిట్‌మెంట్‌కు మరమ్మతులు
అవుకు(కొలిమిగుండ్ల): అవుకు రిజర్వాయర్ రివిట్‌మెంట్‌కు మరమ్మతులు చేపట్టేందుకు ఎస్సార్బీసీ అధికారులు సిద్ధమయ్యారు. కర్ణాటక రాష్ట్రం బెల్గాంకు చెందిన అక్షిత అండర్ వాటర్ సర్వీసెస్ లిమిటెడ్‌కు చెందిన సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకోవడంతో గురువారం వివిధ రకాల యంత్రాలు, సామగ్రి, కెమికల్‌ను రిజర్వాయర్ వద్దకు చేర్చారు. మద్రాసు ఐఐటీకి చెందిన నిపుణుల ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టనున్నారు. సోమవారం నుంచి రివిట్‌మెంట్ పనులు మొదలు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏడాది వ్యవధిలోనే రెండు సార్లు రివిట్‌మెంట్ కుంగిపోవడంతో అధికారులు తాత్కాలిక చర్యలు మాత్రమే చేపట్టారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 4 టీఎంసీలు కాగా కట్టకు ప్రమాదముందని భావించిన అధికారులు గాలేరు నగరి వరద కాల్వ ద్వారా వైఎస్సార్ కడప జిల్లాకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం రెండు టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచారు. కుంగిన రివిట్‌మెంట్ ప్రాంతంలో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేకంగా తెప్పించిన కెమికల్ సాయంతో లీకేజీ నివారణకు చర్యలు చేపట్టనున్నారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రిజర్వాయర్ రివిట్‌మెంట్‌కు మరమ్మతులు


