రూ.12.38 కోట్ల పనులకు టెండర్లు | - | Sakshi
Sakshi News home page

రూ.12.38 కోట్ల పనులకు టెండర్లు

Dec 12 2025 6:07 AM | Updated on Dec 12 2025 6:07 AM

రూ.12

రూ.12.38 కోట్ల పనులకు టెండర్లు

కార్మికులకు ఒక నెల వేతనం వణికిస్తున్న చలి వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం

శ్రీశైలంటెంపుల్‌: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో చేపట్టనున్న ఏర్పాట్లకు 12.38 కోట్లతో టెండర్లు పిలిచినట్లు శ్రీశైల దేవస్థాన ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌ ఎం.నరసింహారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మొత్తం 84 పనులకు టెండర్లు ఆహ్వానించామన్నారు. శుక్రవారం దేవస్థాన పరిపాలన భవనంలో టెండర్లకు సంబంధించిన టెక్నికల్‌ బిడ్‌లను ఓపెన్‌ చేస్తామన్నారు. పైప్‌ పెండ్యాల్స్‌, షామియానాలు, నాలగూటి, పెచ్చెర్వు, కై లాసద్వారం, శివదీక్షా శిబిరాలు, సాక్షిగణపతి, హఠకేశ్వరం, పాలధారపంచధార, పార్కింగ్‌ ప్రదేశాలు, ఉద్యానవనాలు తదితర పనులు చేసేందుకు సుమారు రూ.4.33 కోట్లతో టెండర్లు పిలిచామన్నారు. అలాగే తాత్కాలిక విద్యుద్దీక రణ, ఆలయ గోపురాలు, ఉభయ దేవాలయా లు, ఆరుబయలు ప్రదేశాలలో స్వామిఅమ్మవార్ల చిత్రాలతో విద్యుద్దీకరణ, హైమాక్స్‌లైట్లు, పార్కింగ్‌ ప్రదేశాలలో విద్యుద్దీపాలు, జనరేటర్ల కోసం రూ.1.79 కోట్లతో టెండర్లు పిలిచారన్నారు.

టెట్‌కు 76 మంది గైర్హాజరు

నంద్యాల(న్యూటౌన్‌): రెండవ రోజు గురు వారం జరిగిన టెట్‌ పరీక్షకు 76 మంది అభ్య ర్థులు గైర్హాజరైనట్లు డీఈఓ జనార్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని రాజీవ్‌గాంధీ మెమోరియల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, శాంతిరాం ఇంజినీరింగ్‌ కళాశాల, రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాలలో జరిగిన పరీక్షకు ఉదయం 151 మందికి గాను 103 మంది హాజరు కాగా 48 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 410 మందికి గాను 382 మంది హాజరు కాగా 28 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానం పరిధిలో పద్మావతి ఏజెన్సీ కింద పనిచేస్తున్న శానిటేషన్‌, హౌస్‌ కీపింగ్‌ కార్మికులకు ఎట్టకేలకు ఒక నెల జీతాన్ని సంస్థ చెల్లించింది. గురువారం కార్మికులకు ఒక నెల వేతానాన్ని వారి బ్యాంకు ఖాతాలలో జమ చేసింది. మూడు రోజుల క్రితం సాక్షిలో ‘వేతన.. వేదన!’ శీర్షికతో రెండు నెలలుగా జీతాలు అందక కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన దేవస్థాన అధికారులు పద్మావతి ఎజెన్సీపై ఒత్తిడి తీసుకురావడంతో ఎట్టకేలకు ఒక నెల వేతనాన్ని జమ చేశారు. దీంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): చలి తీవ్రత పెరుగుతోంది. కొద్ది రోజులుగా చలి గజగజ వణికిస్తోంది. సంక్రాంతి సమయానికి రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు పడిపోయే ప్రమాదం కూడా ఏర్పడింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. కర్నూలు జిల్లాలో 15 నుంచి 16 డిగ్రీలు, నంద్యాల జిల్లాలో 15 నుంచి 17 డిగ్రీల వరకు మాత్రమే నమోదు అవుతున్నాయి. రాత్రి 8 గంటలకే చలి తీవ్రత పెరుగుతుండటంతో బయటికి ముఖం చూపలేని పరిస్థితి ఏర్పడింది. ఉదయానికి చలి ప్రభావం మరింత పెరుగుతోంది. ఉదయం 7 గంటల వరకు కూడా చలి పులి ప్రభావం వల్ల బయటకి రాలేని పరిస్థితి ఏర్పడింది. గురువారం కర్నూలు జిల్లాలోని అత్యల్పంగా ఆలూరు, గూడూరుల్లో రాత్రి ఉష్ణోగ్రత 15 డిగ్రీలు మాత్రమే నమోదు అయింది.ఎమ్మిగనూరులో 15.1, కోసిగిలో 15.6, ఆదోనిలో 15.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. నంద్యాల జిల్లాలో అత్యల్పంగా మిడుతూరులో 15.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ప్యాపిలిలో 15.8, గడివేములలో 15.9, డోన్‌లో 16.2, జూపాడుబంగ్లాలో 16.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

కర్నూలు: వయస్సులో 70 ఏళ్ల పైబడిన ఖైదీలకు, అనారోగ్యంతో బాధపడేవారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రితో కలసి గురువారం కర్నూలు పురుషుల, మహిళా కారాగారాలను తనిఖీ చేశారు. జైలులో ఉన్న ఖైదీలు వారి హక్కులను తెలుసుకోవాలని, ఎవరికైనా న్యాయ వాదులు లేకుంటే ఉచితంగా నియమిస్తామన్నారు.

రూ.12.38 కోట్ల పనులకు టెండర్లు 1
1/2

రూ.12.38 కోట్ల పనులకు టెండర్లు

రూ.12.38 కోట్ల పనులకు టెండర్లు 2
2/2

రూ.12.38 కోట్ల పనులకు టెండర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement