టీడీపీకి ఎదురు దెబ్బ
● కో–ఆప్షన్ సభ్యుడి ఎన్నికలో వైఎస్సార్‌పీపీ జయకేతనం
దొర్నిపాడు: మండల కో–ఆప్షన్ సభ్యుడి ఎన్నికలో అధికార పార్టీ టీడీపీకి ఎదురు దెబ్బ తగిలింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అచ్చుకట్ల షఫీబాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ గోవిందనాయక్ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. దొర్నిపాడు మండల ప్రజాపరిత్ కార్యాలయంలో గురువారం ఈ ఎన్నిక ఉత్కంఠంగా సాగింది. కోఆప్షన్ సభ్యుడు అచ్చుకల్ల అల్లా మహమ్మద్ మృతిచెందడంతో ఈ ఎన్నిక నిర్వహించారు. మృతుడి కుమారుడు అచ్చుకట్ల షఫీబాషాకు వైఎస్సార్‌సీపీ పోటీ చేసే అవకాశం ఇచ్చింది. టీడీపీ అభ్యర్థులు దొర్నిపాడుకు చెందిన మాబుహుసేన్, చాకరాజువేముల గ్రామానికి చెందిన నొస్సం హుసేన్‌బాషాలు రెండు నామినేషన్లు వేశారు. వారు తప్పుగా సంతకాలు చేయడంతో నామినేషన్లను పీఓ తిరష్కరించారు. దీంతో అధికారులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అచ్చుకట్ల షఫీబాషా గెలుపును ఏకగ్రీవంగా ప్రకటిస్తూ డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. వైఎస్సార్‌పీపీకి ముగ్గురు, టీడీపీకి ముగ్గురు ఓటర్లు ఉన్నారు. సమాన ఓట్లు ఉండటంతో టాస్ వేసి అభ్యర్థిని ప్రకటిస్తారు అనుకున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన ఇద్దరి అభ్యర్థుల నామినేషన్లు తిరష్కరణకు గురికావడంతో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. ఎన్నిక ఏకగ్రీవం కావడం పట్ల మాజీ ఎమ్మెల్సీ గంగు ప్రభాకర్‌రెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిశోర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ధర్మమే గెలిపించింది
దొర్నిపాడు మండల ప్రజా పరిషత్ కో–ఆప్షన్ సభ్యుడి ఎన్నిక విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్‌ట్ శ్రేణులు ఒకే తాటిపై నిలబడటంతోనే ధర్మమే గెలిచిందని ఎంపీపీ గోపవరం అమర్‌నాఽథ్‌రెడ్డి, సొసైటీ మాజీ ప్రెసిడెంట్ భూమా చెంచిరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల ప్రెసిడెంట్ బత్తుల నాగేశ్వరావు అన్నారు. కోఆప్షన్ సభ్యుడి అచ్చుకట్ల షఫీబాషా ఏకగ్రీవ ఎన్నిక పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కారు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నా కో–ఆప్షన్ సభ్యుడి ఎన్నిక కోసం ఎవ్వరికి భయపడకుండా అండగా ఉన్న కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు మోహన్‌నాయుడు, లక్కు చంద్రశేఖర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, శాంతయ్య, శివరామిరెడ్డి, నాగరాజు, పుల్లారెడ్డి, వైనుద్దీన్, మాబాషా, చిన్నమద్దిలేటి, శ్రీనివాసరెడ్డి, నషిద్దిన్ బాషా, భూమా రామక్రిష్ణారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, రామ్‌నాధ్‌రెడ్డి, ఎంపీటీసీలు పార్వతీ, లక్ష్మీదేవి తదిరులు పాల్గొన్నారు.


