చాలా దారుణం
చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోవడం లే దు. నాకు వ్యక్తిగతంగా రూ.12 వేలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంది. కొంతమంది రూ.30 నుంచి రూ.60 వేల వరకు ఈఎంఐలు చెల్లించాలి. ప్రతి నెలా 5వ తేదీలోపు వేతనాలు పడతాయనే ఉద్దేశంతో ఈఎంఐలు పెట్టుకున్నాం. వేతనాల చెల్లింపులో నెల నెలా జాప్యం పెరుగుతుండటం దారుణంగా ఉంది. నవంబరు నెల వేతనాలు డిసెంబరు 10 వతేదీ వరకు చెల్లించ లేదంటే ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోవడం లేదనే భావన కలుగుతోంది.
– బి.చిన్నశంకర్‌నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్స్ అసోసియేషన్


