‘టెట్’కు 35 మంది గైర్హాజర్
నంద్యాల(న్యూటౌన్): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. పట్టణంలో ఆర్‌జీఎం, శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాల, రామకృష్ణ డిగ్రీ పీజీ కళాశాలలో పోలీసుల బందోబస్తు మధ్య ప్రశాంతగా జరిగాయి. 9.30 గంటలకు మొదలైన పరీక్షకు గంట ముందుగానే అభ్యర్థులు కేంద్రాల దగ్గరకు చేరుకోగా, అరగంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించిన పరీక్షలకు 410 విద్యార్థులకు గాను 375 మంది హాజరు కాగా 35 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి తెలిపారు.
గోస్పాడు: రబీలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు సూచించారు. మండల కేంద్రమైన గోస్పాడులో బుధవారం స్థానిక ఏవో స్వప్నికా రెడ్డి ఆధ్వర్యంలో వరిలో పంటకోత ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రైతులు ఖరీఫ్‌లో సాగు చేసిన వరి పైరు పంటకోత ప్రయోగం చేయగా ఎకరాకు 36 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ అవసరం మేరకే ఎరువులు వాడాలని, సాగునీటిని దృష్టిలో ఉంచుకొని రబీలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలన్నారు. డిమాండ్ ఉన్న పంటలు వేసుకోవాలని సూచించారు. పంట అవశేషాలు కాల్చితే నష్టం చేకూరుతుందన్నారు. కలియదున్నితే లాభమని, పంట అవశేషాలలో నత్రజనీ, భాస్వరం పొటాషియం, సూక్ష్మ పోష కాలు ఉంటాయని తెలియజేశారు. కార్యక్రమంలో ఏఈఓ రామకృష్ణ, అగ్రికల్చర్ అసిస్టెంట్ శ్రీధర్ , ఖాజావలి రైతులు పాల్గొన్నారు.
హక్కులు లేని మనిషి
బానిసతో సమానం
నంద్యాల(అర్బన్): హక్కులు లేని మనిషి బానిసతో సమానమని సెట్కూరు సీఈఓ డాక్టర్. వేణుగోపాల్ అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా స్థానిక అయ్యలూరు మెట్ట వద్ద ఉన్న ఎస్‌వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో సీఈఓ వేణుగోపాల్ మాట్లాడుతూ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ‘మానవ హక్కులు –మన రోజు వారి అవసరాలు’ అనే నినాదంతో ఐకరాజ్య సమితి ప్రపంచ వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి శ్రీకాంత్‌రెడ్డి , కళాశాల చెర్మన్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. మానవహక్కుల గురించి తెలుసుకుని సద్వినియోగ పరుచుకోవడం ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హరి ప్రసాద్‌రెడ్డి, శ్యామ్‌బాబు, భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం
కర్నూలు(అగ్రికల్చర్): ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించాల ని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మాధురి సూచించారు. నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను పొందేందుకు, పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకునేందుకు ప్రకృతి వ్యవసాయం చక్కటి అవకాశమని పేర్కొన్నారు. బుధవారం మద్దూరు నగర్‌లోని ప్రకృతి వ్యవసాయం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీపీఎం మాధురి మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయంలో పనిచేసే ప్రతి ఒక్కరు ఏ–గ్రేడ్ మోడల్స్, ఏటీఎం మోడల్‌తో వ్యవసాయం చేసి ఇతర రైతులకు ఆదర్శంగా ఉండాలన్నారు. ఈ నమూ నాల్లో వేసిన పంటలను రైతులకు చూపించి వారిని ప్రోత్సహించాలన్నారు. ప్రతి రైతు తనకున్న పొలంలో ఒకటి లేదా రెండు పంటలకు పరిమితం కారాదని, వీలైనంతవరకు ఎక్కువ పంటలు సాగు చేయాలన్నారు. గ్రామస్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపచేసేందుకు ఐసీఆర్‌పీలకు ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కన్సల్టెంట్లు రాజేశ్వర్, డీఎల్‌పీఎం లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
‘టెట్’కు 35 మంది గైర్హాజర్


