కోటి సంతకాల ప్రతులు జిల్లా కేంద్రానికి.. | - | Sakshi
Sakshi News home page

కోటి సంతకాల ప్రతులు జిల్లా కేంద్రానికి..

Dec 11 2025 7:26 AM | Updated on Dec 11 2025 7:26 AM

కోటి సంతకాల ప్రతులు జిల్లా కేంద్రానికి..

కోటి సంతకాల ప్రతులు జిల్లా కేంద్రానికి..

● నంద్యాలలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్యెల్యే శిల్పారవి చంద్రకిషోర్‌రెడ్డి నివాసం నుంచి 60 వేల సంతకాల పత్రాలను నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా జిల్లా పార్టీ కార్యాలయానికి చేర్చారు.

● పాణ్యం మాజీ ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన నివాసం నుంచి నియోజకవర్గంలో సేకరించిన 60 వేల పత్రాలను నాయకులు, అభిమానులు నంద్యాల జిల్లా కేంద్రానికి తరలించారు.

● ఆళ్లగడ్డ కోటి సంతకాల పత్రాలను తరలించే వాహనానికి మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

● మాజీ ఎమ్యెల్యే కాటసాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, నియోజకవర్గ పరి శీలకులు భూమా కిషోర్‌రెడ్డి బనగానపల్లెలో ర్యా లీ నిర్వహించారు. సంతకాల పత్రాల వాహనా న్ని వారు జెండా ఊపి నంద్యాలకు తరలించారు.

● డోన్‌లో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాఽథ్‌ రెడ్డి నివాసం నుంచి నియోజకవర్గ పరిశీలకులు దేశం సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ రాజశేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ రాజ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో కోటి సంతకాల పత్రాలను ఒక వాహనంలో జిల్లా కార్యాలయానికి తరలించారు.

● ఆత్మకూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజల నుంచి సేకరించిన సంతకాల పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయానికి వాహనంలో తరలించారు.

● నందికొట్కూరు నియోజకవర్గంలో సేకరించిన సంతకాల పత్రాలను పార్టీ సమన్వయకర్త దారా సుధీర్‌ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement