రైతులంటే ఇంత నిర్లక్ష్యమా
నేను 20 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. ఎకరాకు రూ. 30 వేల వరకు ఖర్చు వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద తొలి ఏడాది పైసా ఇవ్వలేదు. రెండో ఏడాది కూడా పీఎం కిసాన్ రూ. 20 వేలకు బదులు రూ.14 వేసి చేతులు దులుపుకుంది. జగనన్న పాలనలో పంటలకు ఇన్సురెన్స్ చేసి పరిహారం వెంటనే ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఈ–క్రాప్ నమోదు, ఉచిత పంటల బీమా చేయలేదు. రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం పనికి రాదు. – నాగభూషణంరెడ్డి,
10 బొల్లవరం గ్రామం, నందికొట్కూరు మండలం
మా గ్రామంలో జరిగిన రైతన్నా మీ కోసం కార్యక్రమం కేవలం టీడీపీ కార్యకర్తల ఇళ్లకే పరిమితమయ్యింది. గ్రామంలో ఎక్కడా పూర్తి స్థాయిలో అధికారులు తిరగలేదు. నేను ఖరీఫ్‌లో ఆరు ఎకరాల్లో వరి పంటను సాగుచేశాను. 70 కిలోల బస్తా రూ.1300 చొప్పున అడుగుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇదే 70 కిలోల బస్తా రూ.2,500 వరకు కొనుగోలు జరిగింది. రైతులు అధికారులను నిలదీస్తారని భయపడి కేవలం టీడీపీ కార్యకర్తల ఇళ్ల వద్దకే పరిమితమై ముగించారు
– వెంకటేశ్వరనాయక్, ఎస్.ఎన్.తండా, ఆత్మకూరు
రైతులంటే ఇంత నిర్లక్ష్యమా


