వీబీఆర్‌ను పరిశీలించిన ఎమ్మెల్సీల బృందం | - | Sakshi
Sakshi News home page

వీబీఆర్‌ను పరిశీలించిన ఎమ్మెల్సీల బృందం

Dec 4 2025 8:55 AM | Updated on Dec 4 2025 8:55 AM

వీబీఆ

వీబీఆర్‌ను పరిశీలించిన ఎమ్మెల్సీల బృందం

వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను బుధవారం శాసనమండలి అస్సూరెన్స్‌ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు ఇసాక్‌ బాషా, కావూరి శ్రీనివాసులు, ఎంఈ రామచంద్రారెడ్డి పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను ఎస్‌ఈ ప్రతాప్‌ను అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్‌ మరమ్మతులు, నీటి నిల్వ సామర్థ్యం, వివిధ అంశాలపై ఆరా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వెలుగోడు రిజర్వాయర్‌లో ప్రస్తుతం 16. 2 టీఎంసీల నీటి నిల్వ ఉందని దాదాపుగా నంద్యాల జిల్లాలోని ఒక లక్ష 20వేల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు ఇస్తున్నారని చెప్పారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో 1, 70, 000 ఎకరాలు ఆయకట్టు తెలుగుగంగకు ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి తెలుగుగంగ డీఈ వెంకటేశ్వర్లు ఏఈ శివ నాయక్‌, వెలుగోడు మండల తహసీల్దార్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, ఎస్‌ఐ సురేష్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

8వరకు మల్లన్న స్పర్శదర్శనాలు నిలుపుదల

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీ కారణంగా ఈ నెల 8వ తేది వరకు మల్లికార్జున స్వామి స్పర్శదర్శనాన్ని పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు శ్రీశైల దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ పి.రమేష్‌నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు బుధవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కార్తీకమాసం శివదీక్ష విరమణ కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో జ్యోతిర్ముడి కలిగిన శివదీక్షా భక్తులకు మల్లన్న స్పర్శదర్శనం కల్పించాలనే ఉద్దేశంతో సామాన్య భక్తులకు స్పర్శదర్శనం నిలిపివేశామన్నారు. శివస్వాములకు విడతల వారీగా ప్రతి రెండు గంటలకు ఒకసారి స్వామి స్పర్శ దర్శనం కల్పిస్తామన్నారు. ఈ నెల 6,7,8వ తేదీల్లో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నెల 8వ తేది వరకు స్పర్శ దర్శనం అన్‌లైన్‌ టికెట్ల జారీని కూడా నిలుపుదల చేశామని పేర్కొన్నారు. ఈ నెల 5వ తేది వరకు మాత్రం స్వామివారి గర్భాలయ, సామూహిక అభిషేకాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. భక్తులు ఈ మార్పులు గమనించి దేవస్థానానికి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

జరిమానాలు ఉండవు కేసులే!

హొళగుంద: మద్యం సేవించి వాహనాలను నడిపే వారికి ఇక జరిమానాలు ఉండబోవని, కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ హెచ్చరించారు. బుధవారం సాయంత్రం వార్షిక తనిఖీల్లో భాగంగా హొళగుంద పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించారు. ఈ మేరకు నేరాలు, కేసులు, పెండింగ్‌ కేసులు, రికార్డులు, సిబ్బంది పనితీరు, సమస్యలు ఇలా పలు అంశాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సైబర్‌ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగ ఉండాలని, హెల్మెట్‌లపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నట్లు వెల్లడించారు. ఎస్‌ఐలు దిలీప్‌కుమార్‌, మారుతి, ట్రైనీ ఎస్‌ఐ రాజకుళ్లాయప్ప ఉన్నారు.

ఇళ్ల స్థలాల్లో దివ్యాంగులకు ప్రత్యేక కేటాయింపులు

నంద్యాల (వ్యవసాయం): పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లో దివ్యాంగులకు ప్రత్యేక కేటాయింపులు చేస్తామని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, బుధవారం స్థానిక ఎన్టీఆర్‌ పురపాలక టౌన్‌ హాల్‌లో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఐఎంఏ నంద్యాల, లయన్‌న్స్‌ క్లబ్‌ నంద్యాల సహకారంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి చేతుల మీదుగా దివ్యాంగులకు నూతన దుస్తులు, కుట్టు మిషన్లు, చక్రాల కుర్చీలు, వినికిడి యంత్రాలు, చంక కరల్రు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ రవికృష్ణ, అధ్యక్షుడు ఎంపీవీ రమణయ్య, డాక్టర్‌ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి, మధుసూదనరావు పాల్గొన్నారు.

వీబీఆర్‌ను పరిశీలించిన ఎమ్మెల్సీల బృందం  1
1/1

వీబీఆర్‌ను పరిశీలించిన ఎమ్మెల్సీల బృందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement