హామీల అమలులో చంద్రబాబు సర్కారు విఫలం
బేతంచెర్ల: ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని మాజీ ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి ఆధ్వర్యంలో ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు భూ సమస్యలతో పాటు ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను మాజీ మంత్రి బుగ్గనకు విన్నవించారు. అనంతరం బుగ్గన మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్నారు. బాబు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. నియోజకవర్గ ప్రజలు ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు అండగా ఉండి వారి సమస్యలపై పోరాడాలన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమి మాజీ డైరెక్టర్ ముర్తుజావలి, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రుడు, అధికార ప్రతినిధి మురళీ కృష్ణ, నాయకులు తిరుమలేశ్వర్ రెడ్డి, మురళీధర్‌రెడ్డి, నారాయణ, శాలిబేగ్, ముస్తఫా, వన్నూర్ సాహెబ్, గోరుమానుకొండ సర్పంచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


