అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా చంపేశారు
సన్నకారు రైతును అయిన నాకు పీఎం కిసాన్ కింద రూ.2వేలు బ్యాంకులో జమ కాగా, అన్నదాత సుఖీభవ కింద మంజూరు కావాల్సిన రూ.5 వేలను ప్రభుత్వం ఎగ్గొట్టింది. విచారిస్తే స్టేటస్‌లో నేను మృతిచెందినట్లు అధికారులు నమోదు చేశారు. ఇప్పటివరకు ఈ తప్పును సరిదిద్దుకునేందుకు సంబంధిత సైట్‌ను ప్రభుత్వం తిరిగి పునఃప్రారంభించకపోవడం దుర్మార్గం. – తవిసెల రంగనాథ్‌రెడ్డి,
నక్కవాగులపల్లె, డోన్ మండలం
నా వయసు 45 ఏళ్లు.. 25 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు. మొదటి నుంచి టీడీపీ సర్కార్ రైతు వ్యతిరేకంగానే పని చేస్తోంది. గతంలో రుణమాఫీ చేయకపోవడం, ఈ ఏడాది ఒక విడత అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టడం దారుణం. పంట నష్టపోయి ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్న రైతులు ఎక్కడ నిలదీస్తారోననే భయంతో ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదు.
– మురళీధర్‌రెడ్డి, రైతు, మర్రికుంట గ్రామం,
బేతంచెర్ల మండలం
అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా చంపేశారు


