ప్రయోజనం లేదు
పండించిన పంటలకు మద్దతు ధరలు కల్పించకుండా రైతులను మరోసారి మోసం చేసేందుకే చంద్రబాబు ప్రభుత్వం రైతన్న మీ కోసం కార్యక్రమం మొదలు పెట్టింది. సచివాలయ సిబ్బంది తూతూ మంత్రంగా పాల్గొన్నారు. చివరి రోజు మా గ్రామానికి మంత్రి ఫరూక్ వచ్చినా కొద్ది మంది రైతులు మాత్రమే కార్యక్రమానికి హాజరయ్యారు. హాజరైన రైతులు సైతం ఆయకట్టు రోడ్లు, పంటలకు మద్దతు ధర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరడం చూస్తే రైతులను ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తుందో తెలుస్తోంది.
– చిలకల మదన్‌మోహన్,
పులిమద్ది, నంద్యాల మండలం
గత ఏడాది మిర్చికి గిట్టుబాటు ధర లేక తక్కువ రేటుకు అమ్ముకున్నాం. ఈ ఏడాది అనుకులిస్తుదేమో అనుకుంటే అధిక వర్షాలతో పంటల దిగుబడి తగ్గి పెట్టుబడి కూడా రాలేదు. ప్రభుత్వం ఆదుకుంటుందేమో అనుకుంటే అది లేదు. గతంలో ఉచిత పంట బీమా ఉండేది. ఇప్పుడు అది భారమైంది. ఇన్‌పుట్ సబ్సిడీ ఊసే లేదు. – వెంకటేశ్వరరెడ్డి,
రైతు, ఆకుమల్ల, సంజామల మండలం
ప్రయోజనం లేదు


