పల్లెల్లో ఫ్యాక్షన్‌ను తట్టిలేపొద్దు | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో ఫ్యాక్షన్‌ను తట్టిలేపొద్దు

Dec 5 2025 6:54 AM | Updated on Dec 5 2025 6:54 AM

పల్లె

పల్లెల్లో ఫ్యాక్షన్‌ను తట్టిలేపొద్దు

బొమ్మలసత్రం: ‘గత వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ప్రస్తుతం టీడీపీ నాయకులు ఫ్యాక్షన్‌ను తట్టిలేపడం సరికాదు. టీడీపీ నాయకులు ఎన్ని హత్యలు, దాడులకు తెగబడుతున్నా వైఎస్సార్‌సీపీ నాయకులు మౌనంగా ఉన్నారని భావించొద్దు... ఎప్పు డూ మీ సమయమే నడవదూ...సీన్‌ రివర్స్‌ అయితే పరిస్థితులు దారుణంగా ఉంటాయి’ అంటూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి తనదైన శైలిలో ఘాటుగా హెచ్చరించారు. నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ హరినాఽథ్‌రెడ్డిపై బుధవారం కొందరు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను గురువారం కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్యెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా తదితరులు పరామర్శించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు కాటసాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హరినాథ్‌రెడ్డి రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేని కొందరు హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. టీడీపీ నాయకులు ఫ్యాక్షన్‌ జోలికి వెళితే సాధించేది ఏమిలేదన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఫ్యాక్షన్‌లో మగ్గి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధిని చెందిన పల్లెల్లో ఇప్పుడు టీడీపీ నేతలు తిరిగి ఫ్యాక్షన్‌ను పెట్రేగిస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ కొనగాదని.. సీన్‌ రివర్స్‌ అయితే ఇలాంటి గొడవలు చేసే నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేరని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని చంద్రబాబు ప్రభు త్వం ప్రజల దృష్టి పక్కకు తిప్పేందుకు ఇలాంటి దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. తెలంగాణలో ధాన్యం బస్తాను రూ.2,200కు కొనుగోలు చేస్తుంటే ఏపీలో కనీసం రూ. 1,600 కూడా ప్రభుత్వం చెల్లించలేని దుస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు.

ధైర్యం ఉంటే నేరుగా ఎదుర్కోండి.....

టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ నాయకులను ఎదుర్కొనే ధైర్యం లేక కిరాయి హంతకులతో దాడులకు తెగబడుతున్నారని నంద్యాల మాజీ ఎమ్యెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి విమర్శించారు. కిరాయి నేరగాళ్లతో దాడి చేయించే సంస్కృతి గ్రామాల్లోకి తీసుకోరావద్దని హితవు పలికారు. కొత్తపల్లి గ్రామంలో రాజకీయ ఎదుగుదల కోసం టీడీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడటం సిగ్గు చేటన్నారు. పొలం నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తున్న హరినాఽథ్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సునీల్‌ షేరాన్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు కలిసి జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతలపై జరుగుతున్న దాడులను వివరించి దుండగులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వారి వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాబు న్నిసా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీపీ మధుసూదన్‌రెడ్డి జిల్లా విభాగం అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు తదితరులు ఉన్నారు.

అధికారం శ్వాశతం కాదని తెలుసుకోండి

సీన్‌రివర్స్‌ అయితే పరిస్థితులు

దారుణంగా ఉంటాయి

రాజకీయ కక్షతోనే ఎంపీటీసీ

హరినాఽథ్‌రెడ్డిపై హత్యాయత్నం

టీడీపీ నేతలను హెచ్చరించిన

కాటసాని రాంభూపాల్‌రెడ్డి

పల్లెల్లో ఫ్యాక్షన్‌ను తట్టిలేపొద్దు1
1/1

పల్లెల్లో ఫ్యాక్షన్‌ను తట్టిలేపొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement