ఊడిన ఆర్టీసీ బస్సు చక్రం
పాణ్యం: కర్నూలు నుంచి తిరుపతికి 24 మంది ప్రయాణికులతో గురువారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరిన కర్నూల్–2 డిపోకు చెందిన అల్ట్రా డీలక్స్ బస్సు వెనక చక్రం ఊడిపోయింది. దాదాపుగా 100 మీటర్లు దూరం వెళ్లి ఓ హోటల్‌గోడను ఢీకొని కిందపడింది. పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామం వద్ద గమనించిన ప్రయాణికులు కేకలు వేశారు. డ్రైవర్ బస్సు ఆపి ప్రయాణికులను కిందకు దింపారు. చక్రం ఊడిపోయి వెళ్తున్న క్రమంలో బస్సు ఒక కూరగాయల బండిని, నాగరాజు అనే వ్యక్తిని ఢీకొంది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


