వచ్చారు.. వెళ్లారు | - | Sakshi
Sakshi News home page

వచ్చారు.. వెళ్లారు

Dec 5 2025 6:54 AM | Updated on Dec 5 2025 6:54 AM

వచ్చా

వచ్చారు.. వెళ్లారు

కొత్తపల్లి: చదరంపెంట, పాలెంచెరువు గూడెలకు చెందిన గిరిజన రైతులు సుమారు 10 ఎకరాల్లో హర్టీ కల్చర్‌ సాగుకు కింద మామిడి మొక్కలు నాటుకున్నారు. ఆ పంటలను గురువారం శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ నుంచి హర్టీకల్చర్‌ అధికారి, సూపరింటెండెంట్‌ అధికారులు పరిశీలించేందుకు వచ్చారు. అయితే వారు రావడం.. ఫోటోలకు ఫోజులివ్వడం.. వెళ్లిపోవడంతో గిరిజన రైతులు అవాక్కయ్యారు. పంటలను పరిశీలించి సాగులో సూచనలు, మెలకువలు ఏమి చెప్పకుండా వెళ్లడంపై రైతులు విమర్శిస్తున్నారు.

కార్డుదారులకు

3 కేజీల రాగులు

నంద్యాల(అర్బన్‌): డిసెంబర్‌ నెల కోటాకు సంబంధించి జిల్లాలోని ప్రతి రేషన్‌ కార్డు దారుడికి మూడు కిలోల బియ్యం బదులుగా మూడు కేజీల రాగులు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌ తెలిపారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థలో బియ్యం, పంచదారతో పాటు మూడు కేజీల రాగులు అందించనున్నామన్నారు. ప్రజలకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో రాగుల పంపిణీని చేపట్టామన్నారు. కార్డు దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

నాపరాయి లారీలు సీజ్‌

బేతంచెర్ల: సరైన రికార్డులు, వే బిల్లులు లేకుండా బేతంచెర్ల నుంచి నాపరాయిని తరలిస్తున్న ఐదు లారీలను మైన్స్‌, విజిలెన్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. గురువారం పోలీసులు, ప్రైవేట్‌ రాయల్టీ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా నాపరాయి రవాణా చేస్తున్న ఐదు లారీలను గుర్తించి పట్టుకున్నారని మైన్స్‌, విజిలెన్స్‌ అధికారులు సాంబ శివారెడ్డి, దిలీప్‌ కుమార్‌ తెలిపారు.

ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షకు 19 కేంద్రాలు

నంద్యాల(న్యూటౌన్‌): ఈనెల 7వ తేదీన జరిగే నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షకు జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో 19 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీఈఓ జనార్ధన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు 4,120 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. 19 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 19 మంది డిపార్టుమెంట్‌ ఆఫీసర్లు, ముగ్గురు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, ఇన్విజిలేటర్లు నియమించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరన్నారు.

కొనసాగుతున్న పులుల గణన

రుద్రవరం: రుద్రవరం రేంజ్‌ పరిధిలోని 14 బీట్లలో పులుల గణన ప్రారంభం అయ్యింది. రుద్రవరం రేంజ్‌ అధికారి ముర్తుజావలి తెలిపిన వివరాల మేరకు.. రేంజ్‌ పరిధిలోని అన్ని బీట్లలో అట వీ సిబ్బంది అందరు ప్రతి రోజు 3కి.మీ ప్రకారం కాలి నడకన నడుస్తూ మాంసాహార జంతువులైన పులి, చిరుత, ఎలుగుబంటి, రేసు కుక్క, అడవిపిల్లి వంటి వాటికి సంబంధించిన పెంటికలు, పాదముద్రలు, చెట్లను గీకిన గుర్తులు సేకరిస్తున్నారు. అలాగే శాఖాహర జంతువులను గుర్తించేందుకు అదే తరహాలో ప్రతి బీట్‌లో ఉదయాన్నే రోజుకు 2కి.మీ కాలి బాటన నడిచి దుప్పి, అడవి పంది, కొండగొర్రె, కణితి, వంటి వాటి వాటి జంతువుల ఆనవాళ్లను సేకరిస్తున్నారు. వాటి ఆవాసాలను అంచనా వేసేందుకు అడవిలోని వృక్ష సంపద, గడ్డి రకాలు, ఔషధ మొక్కలను గుర్తించి యాప్‌లో నమోదు చేస్తున్నట్లు రేంజర్‌ తెలిపారు. ఇప్పటి వరకు 14 బీట్లలో 210 కి.మీ నడిచి సర్వేలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

23న డాక్‌ అదాలత్‌

కర్నూలు(అర్బన్‌): కర్నూలు డివిజన్‌లోని తపా లా కార్యాలయాల్లో ప్రజలకు అందించే సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతరత్రా సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 23న ఉదయం 11 గంటలకు డాక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోస్టల్‌ సూపరింటెండెంట్‌ జీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే డివిజన్‌లోని ప్రజలు తమ ఫిర్యాదులను ఈ నెల 15వ తేదీ కంటే ముందే చేరే విధంగా పోస్టు ద్వారా పంపాలన్నారు. పోస్టు కవర్‌పై డాక్‌ అదాలత్‌ అని పెద్ద అక్షరాలతో రాసి పంపాలన్నారు.

వచ్చారు.. వెళ్లారు 1
1/1

వచ్చారు.. వెళ్లారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement